లైగర్ టీం తెలుగు వెర్షన్ ని మొదటి నుండి లైట్ తీసుకుంది. బాలీవుడ్ లో ప్రచారం పూర్తి చేస్తున్న తర్వాతే ఇక్కడ మీడియా ముందుకు వచ్చారు. అలాగే లైగర్ పాటలు, షూటింగ్ అంతా బాలీవుడ్ నే. విజయ్ దేవరకొండ, పూరి తప్పా లైగర్ మొత్తం బాలీవుడ్ వాసనే. ఇది తెలుగు సినిమా అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ రూపంలో లైగర్ పై మరో నెగిటివ్ టాక్ పడింది. విజయ్ దేవరకొండ మొదటి నుండి కొంచెం తేడా. అతని యాటిట్యుడ్, బిహేవియర్ తేడాగానే వుంటుంది. పొగరు ప్రతిధ్వనిస్తుంటుంది. అదొక పద్దతి.
ఇప్పుడు వచ్చిన నెగిటివ్ ప్రచారం ఏమిటంటే.. ఇటివల మీడియా ముందుకు వచ్చిన కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని మీడియా ఎదుట ఒక సీన్ క్రియేట్ చేశాడు విజయ్. ఈ సీన్ చేయడానికి కారణం.. నాతో ఫ్రీగా కాళ్ళు మీద కాలు వేసుకొని మాట్లాడొచ్చని ఓ విలేఖరికి చెప్పాడు. అయితే సూది గుచ్చుకుంటే కూడా పెను సంచలనంగా చూపించే ఒక టైపు సోషల్ మీడియా వుంది. ఇప్పుడు విజయ్ కాళ్ళని మాత్రమే చూపిస్తూ.. '' ఇంత పొగరా.. ఒక రెండు ఫ్లాపులు పడితే మళ్ళీ సైడ్ క్యారెక్టర్లు వేసుకుంటావ్'' అని నానా రభస చేస్తుంది. లైగర్ పై మొదటి నుండి పెద్ద పాజిటివ్ వైబ్స్ లేవు. దీనికి ఇప్పుడు మరో నెగిటివ్ ప్రచారం తోడైయింది. అయితే ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లీసిటీ అని ముందుకు వెళ్ళిపోతుంది లైగర్ టీం.