మాళవికా - విజయ్‌ కొత్త సినిమా గురూ.!

మరిన్ని వార్తలు

ఓ యంగ్‌ డైరెక్టర్‌ విజయ్‌ దేవరకొండతో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కించబోతున్నాడట. 'గీత గోవిందం' తరహాలో ఈ సినిమా ఉండబోతుందట. 'గీత గోవిందం' మాదిరి క్లీన్‌గా ఉంటూనే, 'అర్జున్‌రెడ్డి' తరహాలో రా లుక్స్‌లో ఉంటుందట ఈ మూవీ. ఈ సినిమాలో హీరోయిన్‌గా మలయాళ కుట్టి మాళవికా నాయర్‌ పేరును ప్రిఫర్‌ చేశాడట విజయ్‌ దేవరకొండ. 2019 జనవరిలో ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లే అవకాశముంది. ఓ బిగ్‌ బ్యానర్‌ ఈ సినిమాని నిర్మించనుంది. 

మాళవికా నాయర్‌ తొలి సినిమా 'ఎవడే సుబ్రహ్మణ్యం'తో తెలుగు తెరకు పరిచయమైంది. విశేషమేంటంటే విజయ్‌ దేవరకొండకు కూడా ఇదే తొలి చిత్రం. ఈ చిత్రం ద్వారా ఇద్దరికీ మంచి పేరొచ్చింది. ఇకపోతే సెలెక్టివ్‌గా సినిమాలు చేసే మాళవికా నాయర్‌ కెరీర్‌లో ఇంతవరకూ 5 సినిమాల్లో నటిస్తే, వాటిలో మూడు సినిమాలు విజయ్‌ దేవరకొండతోనే నటించింది. అయితే ఈ ఇద్దరూ పూర్తి స్థాయి కపుల్‌గా కనిపించింది లేదు. తాజా చిత్రంలో ఈ జంట పూర్తి స్థాయి కపుల్‌గా అలరించనున్నారట. 

విజయ్‌ నటిస్తున్న 'డియర్‌ కామ్రేడ్‌' చిత్రం పూర్తి కాగానే ఈ సినిమాపై కాన్‌సన్‌ట్రేషన్‌ చేయనున్నాడట. లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన 'టాక్సీవాలా' సినిమాలో ప్రియాంకా జవాల్కర్‌ మెయిన్‌ హీరోయిన్‌ కాగా, మాళవికా 'శిశిర' అనే కీలక పాత్రలో నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS