ఇదీ విజయ్‌ దేవరకొండ స్టామినా.!

మరిన్ని వార్తలు

గడిచిన 48 గంటల్లో తెలుగు సినీ అభిమానుల పైకి'నోటా' అనే సినిమా తాలూకు ప్రభంజనం సునామీలా పోటెత్తింది. సోషల్‌ మీడియాలో ఈ ప్రకంపనల తీవ్రత ఎవరి అంచనాలకీ అందని విధంగా వెళ్లింది. ఐదారు సినిమాలు హీరో ఇంత పాపులారిటీ సంపాదించుకోవడమా? అని అందరూ ఆశ్చర్యపోయారు. 

సినిమా రిజల్ట్‌ ఏంటి.? అనే విషయం పక్కన పెడితే, విజయ్‌ దేవరకొండ రౌడీస్‌ (అభిమానులు) రెండు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా గడిపేశారు. మొబైల్‌ ఫోన్స్‌కీ, కంప్యూటర్స్‌కీ తలకాయలు అర్పించేశారు ఈ సినిమా గురించి. ట్వీట్స్‌, పోస్టులతో హోరెత్తించేశారు. ఎక్కడైనా ఓ నెగిటివ్‌ కామెంట్‌ వస్తే అలా కామెంట్‌ చేసిన వారిపై మూకుమ్మడి దాడి చేశారు. టాలీవుడ్‌లో ఏ అగ్రహీరోకీ తీసిపోని విధంగా విజయ్‌ దేవరకొండ తరపున అభిమానులు వకాల్తా పుచ్చుకున్నారు. 

ప్రీమియర్స్‌కు అభిమానులు పోటెత్తారు. లైవ్‌ అప్‌డేట్స్‌ ఇచ్చారు. వెరసి 'నోటా'కి ఓపెనింగ్స్‌ అద్ధిరిపోయాయ్‌. తెలుగు వెర్షన్‌, తమిళ వెర్షన్‌ ఒకదానితో ఒకటి పోటీ పడుతూ ఓపెనింగ్స్‌ సాధించాయి. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో జ్ఞాన్‌వేల్‌ రాజా నిర్మాణంలో తెరకెక్కిన 'నోటా'లో విజయ్‌ దేవరకొండ సరసన అందాలభామ మెహ్రీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS