ఆన్ స్క్రీన్ లవర్ బాయ్‌లా అలరిస్తున్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ, తాజాగా తన లవ్ లైఫ్‌పై ఓ దిమ్మ తిరిగే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తన లవ్ పూర్తిగా తన పర్సనల్ అట. దాన్ని పబ్లిసిటీగా అస్సలు మార్చనంటున్నాడు మన రౌడీ. లవ్ చేయాల్సి వస్తే, చేస్తాడట. కానీ, అందరికీ చెప్పి చేయాల్సిన అవసరం తనకు లేదంటున్నాడు. అందుకు చాలా టైమ్ కూడా ఉందంటున్నాడు. అసలు లవ్ విషయంలో ఇంత ఘాటుగా ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందో మన రౌడీకి కానీ, రెస్పాన్స్ మాత్రం నిజంగానే దిమ్మ తిరిగేలా చేసింది.
ఇకపోతే, మనోడు ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమాలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి పూరీ జగన్నాధ్ డైరెక్టర్. ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ముంబయ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన ‘ఫైటర్’ టీమ్ ప్రస్తుతం కరోనా హాలీడేస్‌లో రెస్ట్ తీసుకుంటోంది. ఈ హడావిడి తగ్గగానే తదుపరి షూటింగ్ షెడ్యూల్ ప్లాన్ చేయనుందట. ఈ కరోనా హాలీడేస్ టైమ్‌ని మన రౌడీ తన ఆన్‌లైన్ బట్టల బిజినెస్ కోసం కేటాయించేశాడు. చక్కగా ఇంటి పట్టునే ఉండి, ఆ ఆన్‌లైన్ బిజినెస్ పనులు చూసుకుంటున్నాడట.