తాను హీరో కాకముందు, ప్రొడక్షన్ హౌస్‌ల ముందు నిలబడి ఎన్ని పాట్లు పడ్డాడో ఆ పాట్లు ఇండస్ట్రీలో రాణించాలనుకుని కోటి ఆశలతో అడుగు పెట్టే సామాన్యులు పడకూడదనే సదుద్దేశ్యంతోనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్‌ని ప్రారంభించానని చెబుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. తన సొంత ప్రొడక్షన్‌లో దర్శకుడు తరుణ్ భాస్కర్‌ని హీరోగా చేసేశాడు. షబ్బీర్ అనే షార్ట్ ఫిలిం డైరెక్టర్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేస్తున్నాడు.
'మీకు మాత్రమే చెప్తా' అంటూ కొత్త కాన్సెప్ట్‌ని ఆడియన్స్‌ని పరిచయం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఏది చేసినా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండాలనుకుంటాడు. అలా వచ్చిన ఆలోచనే 'మీకు మాత్రమే చెప్తా' మూవీ. నిజానికి ఈ సినిమా విజయ్ దేవరకొండ హీరోగానే రూపొందాల్సి ఉందట. ఆయన 'అర్జున్ రెడ్డి' సినిమా చేస్తున్న టైమ్‌లోనే ఈ స్టోరీ ఆయన వద్దకు వచ్చిందట. అయితే, అప్పుడే విజయ్ చెప్పేశాడట. 'అర్జున్ రెడ్డి' హిట్ అయితే ఈ సినిమాలో నేను నటించలేను.
కానీ, ఖచ్చితంగా ఈ సినిమాని నేనే నిర్మిస్తాను.. అని ఆ మాటను మర్చిపోకుండా నిర్మాతగా మారడం, తరుణ్ భాస్కర్‌ని హీరోగా పెట్టి సినిమా పూర్తి చేయడం అన్నీ టక టకా జరిగిపోయాయి. నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానున్న 'మీకు మాత్రమే చెప్తా' సినిమాని ప్రమోట్ చేయడంలో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. ఓవర్సీస్‌లో విజయ్ దేవరకొండకున్న క్రేజ్‌తో ఈ నెల 31న యుఎస్‌లో ప్రదర్శించబోయే ప్రీమియర్స్‌కీ హంగామా కూడా అంచనాలు రేపుతోంది.