పుష్ష అయిపోగానే... సుకుమార్ - విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని ఇది వరకే ఓ అధికారిక ప్రకటన బయటకు వచ్చింది. అయితే.. ఆ తరవాత ఈ కాంబోపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. సుకుమార్ - విజయ్ దేవరకొండ కాంబో కష్టమేనని, ఈ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయిందని పుకార్లు వ్యాపించాయి. నిజానికి... సుకుమార్ దృష్టి ఇప్పుడు పూర్తిగా విజయ్ సినిమాపైనే ఉన్నట్టు భోగట్టా.
`పుష్ఫ` అవ్వగానే.. ఎలాంటి గ్యాప్ లేకుండా.. విజయ్ దేవరకొండ సినిమాని పట్టాలెక్కించాలని సుకుమార్‌భావిస్తున్నాడట. అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నాడని తెలుస్తోంది. లాక్‌డౌన్ కారణంగా `పుష్ష`కు బ్రేక్ పడింది. ఈలోగా... విజయ్ దేవరకొండ స్క్రిప్టుపై కసరత్తు చేయడం మొదలెట్టాడట.
విజయ్ సినిమా పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో సాగబోతోంది. అందుకే.. తెలంగాణలో ఈ సినిమాకి సరిపోయే లొకేషన్ల వేట కూడా మొదలెట్టేశాడని తెలుస్తోంది. అంతేకాదు... ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణలు విషయాలపై కూడా సుకుమార్ కసరత్తు చేస్తున్నాడట. సో... `పుష్ష` పూర్తయినవెంటనే... విజయ్ సినిమా మొదలవ్వడం ఖాయమన్నమాట.