రాత్రికి రాత్రే స్టార్ అయిపోవడమనే ఫీలింగ్ ఎలా ఉంటుందో విజయ్ దేవరకొండను చూసి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఒక్క సినిమాతోనే సెన్సేషనల్ స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. స్టార్‌డమ్ సంపాదించుకోవడం ఓ ఎత్తైతే, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం ఇంకో ఎత్తు. ఆన్ స్క్రీన్ హీరోయిజంతో పాటు, ఆఫ్ స్క్రీన్ హీరోయిజం కూడా చూపిస్తుంటాడు విజయ్ దేవరకొండ. అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు సాయం కోసం ఎదురు చూసేవారికి మొట్ట మొదట తోడుగా నిలిచే హీరో విజయ్ దేవరకొండనే.
తన సంపాదన నుండి, ఒక్క రూపాయినైనా పేదల కోసం ఖర్చు పెడుతుంటాడు. అందుకే విజయ్‌కి అంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఇక సోషల్ మీడియాలో విజయ్‌కి ఉన్న ఫ్యాన్ బేస్ చెప్పనే అక్కర్లేదు. సినిమాలతో ఇతరత్రా వ్యాపకాలతో ఎంత బిజీగా ఉన్నా, ఫ్యాన్స్‌తో ఆల్వేస్ టచ్‌లో ఉంటాడు. హీరో అయినప్పటి నుండీ, ప్రతీ క్రిస్మస్‌కీ తన అభిమానులకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తుంటాడు విజయ్. ఆ క్రమంలో 2019 క్రిస్‌మస్‌కి గాను ఓ అభిమానికి కాస్ట్‌లీ గిఫ్ట్ అందించాడు విజయ్. అభిమాని కోరిక మేరకు మ్యాక్ బుక్ ప్రొని గిఫ్ట్‌గా పంపించాడు. ఆ వివరాలను తెలుపుతూ, తన అభిమాన హీరోకి మనస్పూర్తిగా ధన్యవాదాలు చెబుతూ, ఆ అభిమాని తాజాగా సోషల్ మీడియాలో స్పందించాడు. విజయ్ తన సోదరుడు ఆనంద్ ద్వారా ఈ బహుమతిని అభిమానికి అందచేశాడు. బహుమతిని అందుకున్న సదరు అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఆనందంతో కూడిన ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ఆనంద్‌తో దిగిన ఫోటోలు, తాను అందుకున్న మ్యాక్ బుక్ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మురిసిపోతున్నాడు.