'రౌడీ' ఆటిట్యూడ్‌ పూర్తిగా మారిపోయిందోచ్‌

మరిన్ని వార్తలు

ఒక్క ఫ్లాప్‌.. ఒకే ఒక్క ఫ్లాప్‌.. విజయ్‌ దేవరకొండ ఆటిట్యూడ్‌ని పూర్తిగా మార్చేసిందనుకోవాలేమో. లేకపోతే 'నోటా' రిలీజ్‌కి ముందు విజయ్‌ దేవరకొండకీ, ఇప్పుడు కన్పిస్తున్న విజయ్‌ దేవరకొండకీ చాలా తేడా కన్పిస్తోంది మరి. 'నోటా' ఫ్లాప్‌ తర్వాత, 'ఇప్పుడే పండగ చేసుకోండి.. త్వరలో హిట్‌ కొట్టబోతున్నా..' అంటూ ఓవర్‌గా రియాక్ట్‌ అయి, విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాతే విజయ్‌లో మార్పు మొదలైనట్టుంది.

 

ఆ సమయంలో యంగ్‌ హీరో నిఖిల్‌, విజయ్‌ 'ఆటిట్యూడ్‌'ని క్వశ్చన్‌ చేస్తూ, సినిమా అనే సముద్రంలో మనం ఎంత.? అని సోషల్‌ మీడియా వేదికగా నిలదీశాడు. దాంతో విజయ్‌ అభిమానులు, నిఖిల్‌పై విరుచుకుపడ్డారు. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆల్రెడీ సినిమా విడుదలకు ముందే లీక్‌ అయిన 'ట్యాక్సీవాలా' ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా కోసం తాము పడ్డ కష్టాన్ని సినిమా యూనిట్‌ సోషల్‌ మీడియాలో పంచుకుంటోంటే, ఆ కష్టం పగవాడిక్కూడా రాకూడదంటూ నిఖిల్‌ పేర్కొన్నాడు. సినిమా యూనిట్‌కి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడు. విజయ్‌ బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడని ఆకాంక్షించాడు. 

నిఖిల్‌ నుంచి వచ్చిన 'సానుభూతి' పట్ల సానుకూలంగా స్పందించాడు విజయ్‌. నిఖిల్‌కి థ్యాంక్స్‌ కూడా చెప్పాడు. ఏ హీరోకి అయినా, ఏ నిర్మాతకి అయినా ఎదురుకాకూడని సమస్య సినిమా విడుదలకు ముందు లీక్‌ అవడం. 'అత్తారింటికి దారేది' సినిమా విషయంలో ఇలగే జరిగింది. మళ్ళీ ఈ 'ట్యాక్సీవాలా' సినిమాకి అలా జరిగింది. 'అత్తారింటికి దారేది'లా 'ట్యాక్సీవాలా' నిలదొక్కుకోవాలని, లీక్‌ చేసినవారికి 'రౌడీస్‌' గట్టి సమాధానమివ్వాలని ఆశిద్దాం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS