విజయ్ దేవరకొండ "టాక్సీవాలా" ఫస్ట్ లుక్ విశేషాలు

మరిన్ని వార్తలు

పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాల‌తో న‌టుడుగా, యువ హీరోల్లో సెన్సేషనల్ స్టార్ గా స్టార్‌డ‌మ్ తెచ్చుకున్న‌ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం టాక్సీవాలా. టాలీవుడ్ అగ్ర‌నిర్మాణ‌సంస్థ‌లు జిఏ 2 మరియు యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ నిర్మాత‌.  రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా తెరెగేట్రం చేస్తున్నారు. 

అర్జున్ రెడ్డి చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ కి యూత్ లో క్రేజ్ ఎలా పెరిగిందో ప్ర‌త్యేఖంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తీసుపోకుండా టాక్సీవాలా చిత్రం రూపుదిద్దుకుంటోంది. విజయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలిచిపోయే చిత్రంగా టాక్సీవాలా ఉండబోతోంది.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడ‌దుల‌వుతున్న ఈ చిత్రం మెద‌టి లుక్ ని మార్చి 23న విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ... విజయ్ దేవరకొండకున్న క్రేజ్, పాపులారిటికి దృష్టిలో పెట్టుకుని ఈ క‌థ‌ని ద‌ర్శ‌కుడు త‌యారుచేశాడు. దానికి తగ్గట్టుగానే అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే విధంగా విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను దర్శకుడు రాహుల్ తీర్చిదిద్దాడు. విజయ్ మ్యానరిజమ్స్, బాడీ లాంగ్వేజ్, క్యారెక్టరైజేషన్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. డైరెక్టర్ రాహుల్ టేకింగ్, సుజిత్ విజువల్స్, జేక్స్ మ్యూజిక్, కృష్ణకాంత్ లిరిక్స్, జాషువా స్టంట్స్ టాక్సీవాలా లో హైలైట్ గా నిలుస్తాయి. 

స్ట్రాంగ్ కంటెంట్, ఆర్టిస్టుల పెర్ ఫార్మెన్స్ ను దృష్టిలో ఉంచుకొని ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మించాం. ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. మే 18న టాక్సీవాలా ను ప్రపంచవ్యాప్తంగా గ్రాండియర్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మార్చి 23న ఈ చిత్రం యెక్క మెద‌టి లుక్ ని విడుదల చేస్తున్నాం..అని అన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS