విజయ్‌ దేవరకొండతో కారులో షికారు చేస్తారా.?

మరిన్ని వార్తలు

'మీ ఇంటికొస్తా, మీ నట్టింటికొస్తా, మిమ్మల్ని కారులో షికారుకు తీసుకెళ్తా..' అంటున్నాడు మన బంగారు కొండ విజయ్‌దేవరకొండ. ఏంటీ బిగ్‌ ఆఫర్‌ అనుకుంటున్నారా.? అవును విజయ్‌ దేవరకొండ ఏం చేసినా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా ఉండాలనుకుంటాడు. అందుకే ఈ ఓపెన్‌ ఆఫర్‌.

 

అసలు విషయమేంటంటే, పేరు, ఈమెయిల్‌ ఆడ్రస్‌, పికప్‌ లొకేషన్‌, డ్రాపింగ్‌ లొకేషన్‌ సబ్‌మిట్‌ చేస్తూ ఓ ఫామ్‌ ఫిల్‌ చేస్తే చాలు. సోషల్‌ మీడియాలో విజయ్‌ దేవరకొండ ఈ ప్రకటన ఇచ్చాడు. ఇంకేముంది గెట్‌ రెడీ ఫర్‌ దిస్‌. అసలే విజయ్‌కి ఇలాంటి విషయాల్లో ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ. ఇంకేముంది ఆయనతో కలిసి షికారు చేసే ఛాన్స్‌ అంటే ఊరుకుంటారా? ఇంతకీ ఈ తాపత్రయమంతా 17న విడుదల కాబోయే 'టాక్సీవాలా' సినిమా కోసం. 

ఇలాంటి ఓపెన్‌ ఆఫర్‌ ఏదో ఒకటి ఇవ్వకపోతే ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించేదెలా.? ఆడియన్స్‌ పల్స్‌ని బాగా పట్టేసిసోడు మన విజయ్‌దేవరకొండ. ఏదో 'నోటా'తో ఢీలా పడినంత మాత్రాన విజయ్‌ని తక్కువంచనా ఎలా వేసేయగలం చెప్పండి. పైరసీ బూతం వెంటాడినా, డిఫరెంట్‌ హారర్‌ కాన్సెప్ట్‌ 'టాక్సీవాలా'ని గట్టెక్కించేస్తుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు 'టాక్సీవాలా' టీమ్‌. 

రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌దేవరకొండ సరసన ప్రియాంకా జవాల్కర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS