మెగా 'హారర్‌' సందడి

మరిన్ని వార్తలు

'ఎంతో మంచి అత్తమ్మను భయపెట్టిన కోడలు' ఏంటీ క్యాప్షన్‌ అనుకుంటున్నారా? తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో హాలోవీన్‌ పార్టీ సందడిగా చేసుకున్నారు. చిరంజీవితో సహా మెగాస్టార్‌ కుటుంబ సభ్యులంతా ముఖానికి రకరకాల రంగులు, హారర్‌ కాస్ట్యూమ్స్‌ ధరించి, భయంకరంగా ముస్తాబయ్యారు. 

ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఎప్పుడూ ప్లజెంట్‌గా కనిపించే మెగా కుటుంబం ఒక్కసారి ఇలా హారర్‌ లుక్స్‌తో కనిపించేసరికి ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యారు. ఆ తర్వాత పండగ చేసుకున్నారు. చిరంజీవితో పాటు ఆయన కూతుళ్లు సుస్మిత, శ్రీజ, అల్లుళ్లు, కోడలు ఉపాసన, వరుణ్‌తేజ్‌, సాయి థరమ్‌తేజ్‌, నిహారిక, అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి తదితరులు ఈ ఫోటోల్లో కనిపిస్తున్నారు. అయితే ఈ ఫోటోలో అందరూ డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తున్నారు. 

కానీ రామ్‌చరణ్‌ మాత్రం అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నట్లున్నారు. బ్లాక్‌ కలర్‌ సాదా దుస్తుల్లో కనిపిస్తున్నారు. అత్తమ్మ సురేఖను కోడలు ఉపాసన భయపెడుతున్నట్లుగా ఉన్న ఫోటో ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ ఫోటోకే ఉపాసన పైన చెప్పిన క్యాప్షన్‌ని యాడ్‌ చేసింది. ఇలా మెగా కుటుంబంలో హాలీవీన్‌ పార్టీతో జబర్దస్త్‌ సందడి నెలకొంది. అప్పుడప్పుడూ మెగా కుటుంబంలో ఇలాంటి స్పెషల్‌ పార్టీలు జరుగుతూంటాయి. ఆ ఫోటోలు బయటికి వచ్చాక ఫ్యాన్స్‌ చూసి మస్త్‌ పండగ చేసుకుంటుంటారు. 

ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే రామ్‌చరణ్‌ బోయపాటి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దాదాపు చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకి 'వినయ విధేయ రామ' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS