సినిమా ప్రమోషన్ కోసం చాలా జిమ్మిక్స్ చేస్తుంటారు. అదంతా సినిమా పబ్లిసిటీలో భాగమే. అయితే, 'గీత గోవిందం' సినిమా విషయంలో ఈ పబ్లిసిటీ జిమ్మిక్స్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న 'కామెంట్స్ షేరింగ్' అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
సినిమాలో గీత పాత్రలో నటిస్తోన్న హీరోయిన్ రష్మిక మండన్న, గోవింద్ పాత్రలో నటిస్తున్న విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఫస్ట్ లుక్ నుంచి, తాజాగా సినిమా ఆడియో సింగిల్ వరకు ఈ కామెంట్స్ ప్రవాహం కొనసాగుతూనే వుంది. లేటెస్ట్‌గా 'వాట్ ద ఎఫ్' అన్న మాట తాను అనాల్సిందనీ, గోవింద్ ఎలా అనేస్తాడంటూ రష్మిక సోషల్ మీడియాలో కామెంట్ చేసింది. నిజానికి 'వాట్ ద ఎఫ్' అంటే, అదొక బూతు. కానీ, ఇక్కడ వ్యవహారం వేరేలా వుందని సినిమా యూనిట్ సిబ్బంది అంటోంది.
అదేంటో ఆడియో సింగిల్ బయటకొచ్చాక క్లారిటీ దొరుకుతుందేమో. ఈలోగా రష్మికపైనా, విజయ్ దేవరకొండపైనా ట్రాలర్స్ రెచ్చిపోతున్నారు. సెలబ్రిటీలు ఏదన్నా ఓ మాట అంటే చాలు దాన్ని పట్టుకుని ట్రాలింగ్ చేసే నెటిజన్లు, 'వాట్ ద ఎఫ్' అన్న మాట చుట్టూ రెచ్చిపోకుండా ఎలా ఉంటారు? 'గీత గోవిందం' సినిమా టీజర్ చూస్తే, ఇదొక క్లీన్ సినిమా అనే అభిప్రాయం కలగడం సహజమే. కానీ, 'వాట్ ద ఎఫ్' అనే ఆడియో సింగిల్ లైన్ బయటకు వచ్చాక, సీన్ మారిపోయింది.
హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ అదిరిపోతుందా? హీరో హీరోయిన్ల సోషల్ మీడియా ఫైట్ ఎన్నాళ్ళు జరుగుతుంది? జస్ట్ వెయిట్ అండ్ వాచ్.