విజయ్-మారుతి కలయికలో..

మరిన్ని వార్తలు

ఎవడే సుబ్రహ్మణ్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెళ్లి చూపులతో అందరి దృష్టిలో పడి అర్జున్ రెడ్డి తో సంచలనం సృష్టించి గీత గోవిందంతో స్టార్ హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ ఏమి చేసినా అదొక ట్రెండ్ లా మారిపోయింది.

ఇక ఆయన తాజాగా ఒక చిత్రం చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టుగా తెలిసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి- దర్శకుడు మారుతి దర్శకత్వంలో UV క్రియేషన్స్ నిర్మాణంలో విజయ్ ఒక చిత్రం చేయనున్నాడట. ఇది త్వరలోనే పట్టాలేక్కనుందట. దీనికి సంబంధించిన ఒక ప్రకటన రానుందట.

ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే చిత్రం షూటింగ్ లో విజయ్ బిజీ ఉండగా దర్శకుడు మారుతీ తాను తీసిన శైలజరెడ్డి అల్లుడు విడుదల చేసే పనిలో ఉన్నాడు. తమ తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న వీరిరువురు అవి అయిపోగానే ఈ ప్రాజెక్ట్ ని మొదలుపెదతారాట.

కచ్చితంగా ఈ ఇద్దరి కలయికలో ఒక ఆసక్తికర చిత్రమైతే వస్తుంది అని చెప్పొచ్చు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS