ఫస్ట్ టైమ్ ఛార్టెడ్ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాం అంటూ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఫస్ట్ టైమ్ ప్రైవేట్ జెట్ లో జర్నీ చేస్తున్న ఫ్యామిలీ వీడియోను ఆనంద్ దేవరకొండ తన ఫోన్ లో షూట్ చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అవుతుంటే అమ్మ భయాన్ని, అమ్మకు నాన్న ధైర్యం చెప్పడాన్ని ఆనంద్ కెమెరాలో చిత్రీకరించారు. అలాగే ఫ్లైట్ జర్నీలోనూ తమ్ముడి కొత్త సినిమా పుష్పక విమానం ను ప్రమోట్ చేస్తూ విజయ్ దేవరకొండ వీడియోలో కనిపించారు. అన్న ఎప్పుడూ బిజీనే అని ఆనంద్ దేవరకొండ అనగా, నీ మూవీ ప్రమోషన్ చేస్తున్నా అంటూ విజయ్ రిప్లై ఇచ్చారు.
ఇలా సరదాగా తిరుమలకు ప్రయాణించారు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులు. వెంకటేశ్వరుడిని దర్శించుకుని ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా పుష్పక విమానం ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. పుష్పక విమానం సినిమా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు దామోదర తెరకెక్కించారు. విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని 'కింగ్ అఫ్ ది హిల్' ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి.
గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ దషి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు. గీతా సైని నాయికగా నటించింది. నవంబర్ 12న థియేటర్ లలో విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది "పుష్పక విమానం". ఈ సినిమా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది అని నమ్మకంగా చెబుతున్నారు ఆనంద్ దేవరకొండ.