వావ్‌.! వాట్‌ ఏ ఎనర్జీ 'కామ్రేడ్‌'!

మరిన్ని వార్తలు

మ్యూజిక్‌ ఫెస్టివల్‌ పేరుతో విజయ్‌ దేవరకొండ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిజంగానే సెలబ్రేషన్స్‌లానే ఈ ఈవెంట్స్‌ని నిర్వహించారు. ఈవెంట్స్‌లో రెట్టించిన ఉత్సాహంతో చిందేసి, విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. వావ్‌! వాట్‌ ఏ ఎనర్జీ విజయ్‌.. అనకుండా ఉండలేకపోయారు ఆయన పర్‌ఫామెన్స్‌ చూసి ఆడియన్స్‌. నిజంగా స్క్రీన్‌పై కూడా ఆ రేంజ్‌లో డాన్సులు చేయని విజయ్‌ దేవరకొండ మ్యూజిక్‌ ఫెస్టివల్‌లో పంచిన ఎంటర్‌టైన్‌మెంట్‌ అంతా ఇంతా కాదు.

 

ఈ స్థాయిలో ఇంతవరకూ ఏ సినిమాకీ ప్రమోషన్స్‌ జరిపింది లేదు. విజయ్‌తో పాటు, రష్మికా కూడా చాలా కష్టపడింది. ఎనర్జిటిక్‌గా స్టెప్పులేసి వాహ్‌వా అనిపించింది. సినిమా ప్రమోషన్స్‌ అంటే, ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి రావడం, లేదంటే, కొన్ని ఇంటర్వ్యూస్‌లో పార్టిసిపేట్‌ చేయడం.. ఇంతే చూశాం ఇంతవరకూ. కానీ, విజయ్‌ దేవరకొండ ప్రమోషన్స్‌కి కొత్త అర్ధం చెప్పాడు ఈ మ్యూజిక్‌ ఫెస్టివల్స్‌తో.

 

మొత్తానికి విజయ్‌ - రష్మికా చేస్తున్న మ్యూజిక్‌ హంగామా సినిమాకి ఎంతలా యూజ్‌ అవుతుందో ఏమో కానీ, విడుదలకు ముందే ఫుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచుతున్నారనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మరోవైపు 'డియర్‌ కామ్రేడ్‌' ప్రతీ అమ్మాయి ఖచ్చితంగా చూడదగ్గ సినిమా.. ప్రేమించిన దాని కోసం ప్రతీ ఒక్కరూ పోరాటం చేయాలని చాటి చెప్పే సినిమా ఇది..' అని ఈ సందర్భంగా రష్మికా సినిమా గురించిన కొన్ని ఆశక్తికరమైన అంశాల్ని పంచుకుంది. ఈ సినిమాలో రష్మికా క్రికెటర్‌గానూ, విజయ్‌ దేవరకొండ విద్యార్ధి నాయకుడిగా రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS