ఇస్మార్ట్‌ అందాలకు ఇక తిరుగే లేదోచ్‌!

మరిన్ని వార్తలు

నిధి అగర్వాల్‌కి సక్సెస్‌ టేస్ట్‌ తెలిసిందిన్నాళ్లకు. తెరంగేట్రం చేసి చాలా కాలమే అయ్యింది. రెండు సినిమాలతో రాని సక్సెస్‌ ముచ్చటగా మూడో సినిమాతో అందుకుంది అందాల నిధి అగర్వాల్‌. అందమున్నా, అందాలారేసే గట్స్‌ ఉన్నా, సక్సెస్‌ లేకుంటే, వాటికి విలువే లేదు. కానీ, ఆ సక్సెస్‌నీ చవి చూసేసింది. ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. టాలీవుడ్‌లో హీరోయిన్స్‌గా రాణించాలంటే, ఇంతకన్నా కావాల్సిందేముంటుంది.

 

అసలే హీరోయిన్స్‌ కొరత. ఆ కరువులో నిధిలాంటి అందాల భామల అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతానికి నిధి అగర్వాల్‌ చేతిలో చేయాల్సిన సినిమాలేమీ లేవు. కానీ, 'ఇస్మార్ట్‌ శంకర్‌' హిట్‌తో నిధి కోసం కొన్ని ప్రాజెక్టులు లైన్‌లో ఉన్నాయంటూ టాక్‌ అప్పుడే సర్క్యులేట్‌ అయిపోతోంది. నిధితో పాటు, మరో ముద్దుగుమ్మ నభాకి కూడా అవకాశాలు పోటెత్తుతున్నాయట. ఈ ఇద్దరు భామలకూ ముచ్చటగా మూడో సినిమాకే ఇస్మార్ట్‌ హిట్‌ దక్కడం, అదీ పూరీ సినిమాతో దక్కించుకోవడం విశేషం.

 

అలాగే ఇకపై ఈ ఇద్దరూ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఈ హిట్టే నాంది అవుతుందనడం అతిశయోక్తి కాదేమో. నిధితో పోల్చితే, నభాకి పర్‌ఫామెన్స్‌ పరంగానూ మంచి పేరుంది. ఇక అందాల ఆరబోత విషయంలో ఈ పాప కాస్త దూరమేమో అనుకున్నారు ఆమె గత చిత్రాలతో పోల్చి. కానీ, పూరీ అందరూ షాక్‌ తినేలా ఈమెలోని గ్లామర్‌ యాంగిల్‌ని బయటికి తీసేశాడు. దాంతో నభాకి మంచి బ్రేక్‌ వచ్చింది. ఈ సినిమాతోనే టాలీవుడ్‌కి కొత్తగా ఈ అందాల భామలు పరిచయమయ్యారా.? అన్నంతగా ఫ్రెష్‌ అప్పీల్‌ కలిగించారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS