విశ్వక్‌సేన్‌తో ఆడుకుంటున్న రౌడీస్‌.!

మరిన్ని వార్తలు

‘ఫలక్ నమా దాస్‌’ చిత్రంతో హీరోగా డెబ్యూ చేసిన విశ్వక్‌సేన్‌, నటనలో మంచి మార్కులేయించుకున్నాడు. మల్టీ టాలెంటెడ్‌ అయిన ఈ కుర్రోడు తొలి సినిమాకే విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ‘హిట్‌’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. చిన్న సినిమాగా స్టార్ట్‌ అయిన ఈ సినిమా రిలీజ్‌కి ముందే పోజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హిట్‌’ మూవీ ప్రీ టాక్‌కి తగ్గట్లుగానే మార్నింగ్‌ షోకి మంచి టాక్‌ తెచ్చుకుంది. విశ్వక్‌సేన్‌ తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడని ఇప్పటికే సినిమా చూసిన వాళ్లు మాట్లాడుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. అయితే, తొలి సినిమా ‘ఫలక్‌నుమా దాస్‌’ నుండే విశ్వక్‌ సేన్‌కీ, రౌడీ విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌కీ మధ్య అగ్గిపుల్లేస్తే భగ్గుమంటోంది. ఆ సినిమా టైమ్‌లో విశ్వక్‌సేన్‌ని రౌడీస్‌ తెగ ఆడేసుకున్నారు.

 

అయితే, ఆ వివాదం అప్పటితో సద్దు మనిగిపోయిందనుకున్నారంతా. కానీ, ఇంకా కంటిన్యూ అవుతుందని లేటెస్ట్‌ సర్క్యులేషన్‌ ద్వారా అర్ధమవుతోంది. సోషల్‌ మీడియా వేదికగా మరోసారి రౌడీ ఫ్యాన్స్‌ విశ్వక్‌సేన్‌ని ఓ పట్టు పడుతున్నారు. సినిమాపై నెగిటివిటీ స్ప్రెడ్‌ చేస్తున్నారట. అయితే, ఈ సినిమాకి పెద్దల అండదండలు దండిగా ఉండడంతో, ఈసారి రౌడీ ఫ్యాన్స్‌ ఆటలు చెల్లెలా కనిపించడం లేదు. కంటెంట్‌ ఉంటే ‘హిట్‌’ని ఆపడం సాధ్యమేనా.? చూడాలిక. ఇకపోతే, కొత్త దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాని ప్రశాంతి త్రిపురనేనితో కలిసి నేచురల్‌ స్టార్‌ నాని నిర్మించిన సంగతి తెలిసిందే. రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS