ఇప్పుడు చెన్నై ఫిలిం స్టూడియో నుండి ఢిల్లీ వరకు వినిపిస్తున్న ఏకైక మాట- మెర్సల్.
మెర్సల్ చిత్రంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలులోకి తెచ్చిన GST బిల్లు కి వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉన్నాయంటూ ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కుదరని పక్షంలో సదరు సన్నివేశాలని కత్తెరించాలని తమిళనాట బీజేపీ పార్టీ ఆందోళన చెప్పట్టింది.
ఇక ఈ అంశంలో దేశంలోని రెండు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈ అంశం పై తలోదారి వెతుకున్నాయి. మెర్సల్ చిత్రం సెన్సార్ నిర్వహించాకే విడుదల అయిన పక్షంలో మరొకసారి రీ-సెన్సార్ నిర్వహించాలని బీజేపీ పార్టీ కోరడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.
దీనికి బీజేపీ పార్టీ కౌంటర్ ఇస్తూ- హిందీ చిత్రం అయిన ఇందు సర్కార్ విషయంలో ఇదే దోరణిలో ఎందుకు స్పందించలేదు అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది.
మొత్తానికి ఈ రాజకీయ పార్టీల ఆధిపత్య పోరులో మెర్సల్ చిత్రానికి ఫ్రీగా పబ్లిసిటీ దొరుకుతున్నది.