విజయ్ హీరోగా 'అదిరింది' సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇంకా తెలుగులో విడుదల కాలేదు. తమిళంలో విడుదలయ్యింది. అక్కడ 'మెర్సల్' టైటిల్‌తో ఈ సినిమా విడుదలయ్యింది. మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమా స్టోరీ వైద్య రంగానికి సంబంధించి ఉండడంతో, కొందరు వైద్యులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో సినిమాపై వివాదాలు ముసురుకున్నాయి. వైద్య రంగానికి సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ వైద్యులు ఈ సినిమాని బ్యాన్ చేయాలని గొడవ చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించి, లింక్స్‌ని షేర్స్ చేయాలని కోరుతున్నారు. అయితే వైద్య రంగానికి సంబంధించి సినిమాలు ఇప్పుడు కొత్తేం కాదు. గతంలో తెలుగులో వెంకటేష్ హీరోగా 'గణేష్' సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఆ సినిమా ఓ సంచలనం. కాగా వైద్యులు ఆ సినిమాపై కూడా ఇలాంటి అభ్యంతరాలనే వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. వెంకటేష్ కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది. వైద్య రంగంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను కళ్లకు కట్టినట్లుగా చూపించారు ఆ సినిమాలో. అవును అవన్నీ నిజాలే. ఇప్పుడు కూడా నిజాలే చూపించే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. ఒక రకంగా సినిమాకి ఈ రకమైన వివాదాలు ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడతాయనే చెప్పాలి. ఈ వివాదాల పరంగా, సినిమాపై మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. అఫ్‌కోర్స్ సినిమాలో చూపించారనీ నిజ జీవితంలో డ్టార్లు మారిపోరు. వ్యవస్థ మారిపోదు. అయితే జనానికి కొంచెం జ్ఞానోదయం కలుగుతుంది. నిజాలు తెలుస్తాయి. అయినా జనం ఏం చేయలేని పరిస్థితి. ఏది ఏమైనా 'అదిరింది' సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. ఇక తెలుగులో ఎంత మేర విజయం సాధిస్తుందో చూడాలిక.