మెల్ల మెల్లగా విజయ్ సేతుపతి తెలుగులోనూ మార్కెట్ స్టాండర్ట్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇటీవల 'విజయ్ సేతుపతి' సినిమాతో మాస్ ఏంటో చూపిస్తానంటూ వచ్చాడు. ఫర్వాలేదు. చూపించాడు. ఇప్పుడు థ్రిల్ ఇస్తానంటున్నాడు. ఓ సైకిలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంతో మన ముందుకు రాబోతున్నాడు. అప్పుడెప్పుడో విజయ్ సేతుపతి నటించిన 'పిజ్జా' సినిమా తెలుగులో మంచి విజయం అందుకుంది. అప్పటికి విజయ్ సేతుపతి పెద్దగా తెలియనప్పటికీ హారర్ కంటెంట్‌తో వచ్చిన 'పిజ్జా' ఆసక్తికరమైన హిట్ అందుకుంది తెలుగులో.
ఇటీవల 'సైరా'లో విజయ్ సేతుపతి చిన్న పాత్రలో కనిపించినా ఆ పాత్ర ఆడియన్స్‌లో గుర్తుండిపోయింది. అయినా, అప్పటికీ, ఇప్పటికీ విజయ్ సేతుపతి రేంజ్ వేరు. తెలుగులో స్ట్రెయిట్‌గా విలక్షణ పాత్రలు పోషిస్తున్నాడు. సో తాజా సినిమా విజయ్ సేతుపతికి ఆశించినంతగా కాకున్నా, ఓ మోస్తరు మార్కెట్ తెచ్చి పెడుతుందనడం అతిశయోక్తి కాదేమో.
సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి, 'పిజ్జా 2' అనే టైటిల్‌తో తెలుగులో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. గాయత్రి హీరోయిన్‌గా నటిస్తోంది. రంజిత్ జయకోడి దర్శకుడు. సాంకేతికతను ఉపయోగించి, కొందరు ఆకతాయిలు మహిళల్ని ఎలా వేధిస్తున్నారో అనే సామాజిక సమస్యని బేస్ చేసుకుని ఈ సినిమా రూపొందింది.