గోట్ మూవీ రివ్యూ & రేటింగ్

మరిన్ని వార్తలు

చిత్రం: గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) 
దర్శకత్వం: వెంకట్ ప్రభు 
కథ - రచన : వెంకట్ ప్రభు 


నటీనటులు:  విజయ్ , ప్రశాంత్ , ప్రభు దేవా , స్నేహ , అజ్మల్ అమీర్, జయరాం, లైలా, మీనాక్షి చౌదరి, వైభవ్ తదితరులు.    


నిర్మాతలు: కల్పతి S.అఘోరం, కల్పతి S. గణేష్ , కల్పతి S. సురేష్ .       


సంగీతం: యువన్ శంకర్ రాజా 
సినిమాటోగ్రఫీ : సిద్దార్థ్ నుని 
ఎడిటర్:  వెంకట్ రాజన్ 


బ్యానర్:  AGS  ఎంటర్ టైన్మెంట్  
విడుదల తేదీ: 5 సెప్టెంబర్ 2024 
 


ఐక్లిక్ మూవీస్ రేటింగ్‌: 2.5/5

ఇంగ్లీష్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

 

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్ నటించిన గోట్ మూవీ నేడు ప్రేక్షకుల ముందు వచ్చింది. ఈ మూవీ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఒకటి విజయ్ సినీ కెరియర్ ఈ మూవీతో ముగియనుంది. విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వటం వలన గోట్ తన చివరి సినిమా అని ప్రకటించాడు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇది చివరి సినిమా అని ప్రకటించాడు. మరణించిన విజయ్ కాంత్ ని AI టెక్నాలజీతో ఈ మూవీలో రిక్రియెట్ చేశారు. స్టార్ క్యాస్టింగ్ ఈ చిత్రంలో ఉండటం గమనార్హం. త్రిష ఓ స్పెషల్ సాంగ్ లో కలిపించింది. విజయ్ తండ్రి కొడుకులుగా నటించారు. కొడుకు పాత్రలో నటించిన విజయ్ యంగ్ లుక్ కోసం 'డీ ఏజింగ్' కాన్సెప్ట్ ని వినియోగించారు. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ 200 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ 'గోట్'  ఆడియన్స్ ని అలరించిందో? లేదో? విజయ్ కి ఈ మూవీ ఎలాంటి అనుభవాన్ని మిగిల్చిందో ఈ రివ్యూ లో చూద్దాం.  


కథ:
గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్. తన టీం మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి సీక్రెట్ మిషన్స్ చేస్తూ ఉంటాడు. తన భార్య అను (స్నేహ)కి కూడా ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడతాడు. ఈ నేపథ్యంలోనే ఒక మిషన్ కోసం భార్య పిల్లలతో కలిసి థాయ్ లాండ్ కి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా కొడుకు జీవన్ (విజయ్)ను కోల్పోతాడు. సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయిన అను ఒక పాపకు జన్మనిస్తుంది. కొడుకు మరణానికి కారణం భర్త ఉద్యోగమే అని కోపంతో గాంధీని దూరం పెడుతుంది. గాంధీ కూడా  తన వల్లే కొడుకు చనిపోయాడని గిల్టీగా ఫీల్ అవుతూ తన జాబ్ కి రిజైన్ చేస్తాడు. తరవాత ఒక పని మీద మాస్కో వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకున్న కొడుకు జీవన్ (విజయ్ 2) కనిపిస్తాడు. అతన్ని సంతోషంగా ఇండియా తీసుకు వస్తాడు. కానీ అప్పటి నుంచి గాంధీకి కావల్సిన వాళ్ళు మరణిస్తూ ఉంటారు. అసలు ఆ మరణాలు ఎలా సంభవిస్తున్నాయి? చనిపోయిన జీవన్ ఎలా బతికున్నాడు? గాంధీ తన మనుషుల మరణాలను ఎలా ఎదుర్కొన్నాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   

 

విశ్లేషణ: 
మొదటి నుంచి 'ది గోట్' మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కటంతో కథ పై కూడా అంచనాలు పెరిగాయి. విజయ్ కి ఉన్న మార్కెట్ ఒకటి కాగా విజయ్ చివరి మూవీ అని ఈ మూవీపై మంచి బజ్ ఏర్పడింది. దర్శకుడు వెంకట్ ప్రభుకి  మంచి క్రియేటివిటీ ఉంటుంది. ఈ సారి కూడా అదే క్రియేటివిటీని నమ్ముకుని ఆడియన్స్ హైపు పెంచుకున్నారు. కానీ ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. అసలు విజయ్ ఎందుకు ఈ కథ ఒప్పుకున్నాడని, ఆయన ఫాన్స్ మథన పడుతున్నారు. మొత్తం రొటీన్ కథ, అరవ గోల కామన్. ఊహించలేని ట్విస్ట్ లు లేవు. ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇప్పటికే చాలా సినిమాల్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లుగా చేసే వాళ్ళు ఫ్యామిలీకి కూడా చెప్పకుండా సీక్రెట్ గా మిషన్స్ చేయటం, విలన్ కొడుకుని కిడ్నాప్ చేసి తండ్రికి వ్యతిరేకంగా పెంచటం అన్నీ మామూలే.       


ఇంటర్వెల్ కి వచ్చే సీన్స్, మెట్రో ఫైట్ సీక్వెన్స్ బావున్నాయి. ఫస్టాఫ్‌తో విసిగించినా, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్. ముందే విజయ్ కొడుకు జీవన్ విలన్ అని రివీల్ చేశాక, తరవాత సస్పెన్స్ ఏం ఉండదు. కొంచెం రన్ టైం కూడా తగ్గిస్తే బాగుండేది. విజయ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని చూపించారు కానీ దానికి సంభందించిన సీన్స్ ఆకట్టుకునేలా ఒకటీ లేదు. వైఫ్ అండ్ హస్బెండ్ సీన్స్ కూడా రొటీన్ గా ఉన్నాయి . కామెడీ ట్రాక్ నవ్వు తెప్పించకపోగా, చిరాకు కలిగిస్తుంది. ఉన్న కొని ట్విస్టులు ముందే రివీల్ అవటం సినిమాకి పెద్ద మైనస్. క్లైమాక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. 

 

నటీ నటులు:
విజయ్ డ్యూయెల్ రోల్ నటించి మెప్పించారు. హీరోగా, విలన్ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించారు. విజయ్ మూవీస్ అంటేనే డాన్స్, యాక్షన్ సీన్స్ కి పెద్ద పీఠ వేస్తారు. గోట్ మూవీలో కూడా విజయ్ డాన్స్, ఫైట్స్ తో అలరించారు. విజయ్ యంగ్ ఏజ్ లుక్ కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఇప్పటివరకు హీరో లుక్ లో చూసిన విజయ్ యాక్టింగ్ ని, మొదటిసారి గా విలన్  గా చూసి ఎగ్జైట్అవుతున్నారు ఆడియన్స్. ఒకే టికెట్ పై విజయ్ డబుల్ ట్రీట్ బాగుందని ఫాన్స్ మురిసిపోతున్నారు. ఎమోషనల్ సీన్స్ లో విజయ్ మెప్పించలేక పోయాడు. ఈ మధ్య అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తున్న హీరో ప్రశాంత్ పరవాలేదనిపించారు. ప్రభుదేవా, జయరామ్ , అజ్మల్ వారి పాత్రల పరిధి మేరకు నటించారు. స్నేహకు ఈ మూవీలో నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. మీనాక్షి చౌదరికి మళ్ళీ అన్యాయమే జరిగింది. ఆమె పాత్రకి అసలు ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. కేవలం గ్లామర్ కోసం మీనాక్షిని పెట్టుకున్నారని పించింది. విజయ్ తో సినిమా అనగానే పేరు వస్తుంది అన్న మీనాక్షి  ఆశ అడియాశ అయ్యింది. త్రిష స్పెషల్ సాంగ్ ఆపెరియన్స్ బాగుంది. యోగిబాబు కామెడీ తమిళ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ కావటంతో IPL సీన్స్ కొన్నిటిని చూపించి, ధోని ఫాన్స్ ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేసారు. AI ద్వారా విజయ్ కాంత్ ని కూడా తెర పై క్రియేట్ చేసారు.    


టెక్నికల్ :
టెక్నికల్ టీం విషయానికి వొస్తే దర్శకుడు వెంకట్ ప్రభు స్క్రిప్ట్‌ ని తనకి ఇష్టం వచ్చినట్లు స్వేచ్ఛగా రాసుకున్నాడు. విజయ్ ఆడియన్స్  ని దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ మాస్ యాక్షన్ మూవీగా రూపొందించారు. విజయ్ దేనికి న్యాయం చేకూరుస్తాడో, విజయ్ సినిమా అనగానే ఆడియన్స్ ఏం ఆశిస్తారో వాటిని దృష్టిలో పెట్టుకుని గోట్ తీశారు. కానీ కొత్తగా ఏం చెప్పలేకపోయాడు. కేవలం తండ్రీ కొడుకులు, విలన్ లుగా నటించటం ఒక్కటే కొత్త విషయం.  ఈ మూవీకి సంగీతం మైనస్. యువన్ శంకర్ రాజా సంగీత ప్రియులకి నిరాశ మిగిల్చాడు. ఒక్క పాట కూడా గుర్తుండేటట్టు లేదు. పాటలు ప్లేస్ మెంట్ కూడా కుదరలేదు. ఎదో ఇక్కడ పాట ఉండాలి అన్నట్టు పెట్టేసారు తప్ప, వాటి అవసరం కనిపించదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పరవాలేదనిపించాడు. త్రిష విజయ్ స్పెషల్ సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది. మీనాక్షి తో వచ్చే పాటల కంటే త్రిష, విజయ్ పాట బాగుంది. ఎడిటింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. క్లైమాక్స్ లో  ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందని హింట్ ఇచ్చాడు దర్శకుడు వెంకట్ ప్రభు. ఫైట్స్ విషయంలో గ్రాఫిక్స్ నాణ్యత లేదు.  

 

ప్లస్ పాయింట్స్ 

విజయ్ 
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ 
యాక్షన్ సీన్స్ 


మైనస్ పాయింట్స్ 

విజయ్ యంగ్ ఏజ్ లుక్ 
లెన్త్ 
ఎడిటింగ్ 
పాటలు 
 

ఫైనల్ వర్దిక్ట్: విజయ్ ఫాన్స్ ని మెప్పించే  'గోట్'

ALSO READ : IN ENGLISH


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS