ఇట్స్‌ మేకప్‌ టైమ్‌ టు లేడీ సూపర్‌స్టార్‌!

మరిన్ని వార్తలు

13 ఏళ్ల తర్వాత మళ్లీ ముఖానికి రంగేసుకోనుంది లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి. మహేష్‌బాబు 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమా కోసం విజయశాంతి తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్‌ షూటింగ్‌లో విజయశాంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి విజయశాంతికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతూ, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఈ 13 ఏళ్లలో ఏం మారలేదు. అదే క్రమశిక్షణ, అదే ఆటిట్యూడ్‌, ఆదే డైనమిజమ్‌.. వెల్‌కమ్‌ ఆన్‌ బోర్డ్‌ విజయ శాంతి గారూ.. అంటూ అనిల్‌ రావిపూడి మేడమ్‌ విజయశాంతికి వెల్‌కమ్‌ చెప్పారు.

 

ఈ సినిమాలో విజయశాంతి క్యారెక్టర్‌ ఏంటనేది ఇంకా తెలియ రాలేదు. కానీ, లేడీ సూపర్‌ స్టార్‌ కోసం ఖచ్చితంగా ఏదో పవర్‌ఫుల్‌ రోలే డిజైన్‌ చేసి ఉంటాడు అనిల్‌ రావిపూడి. అందులోనూ లేడీస్‌ రోల్స్‌ని డిజైన్‌ చేయడంలో అనిల్‌ రావిపూడిది అందె వేసిన చెయ్యి. మరి మన లేడీ సూపర్‌స్టార్‌ కోసం ఇంకెలాంటి ప్రత్యేకమైన పాత్ర డిజైన్‌ చేసి ఉంటాడో కదా. మహేష్‌కి బ్లడ్‌ రిలేషన్‌ ఉన్న పాత్ర కాదని విజయ శాంతి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

 

మహేష్‌ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్‌ అజయ్‌ కృష్ణగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ జేమ్స్‌ బాండ్‌ సినిమాలో బాండ్‌ క్యారెక్టర్‌కి అండ దండగా ఉంటూ, ఆయనకు అన్ని విషయాల్లోనూ పలు సూచనలూ, సలహాలు ఇచ్చే పవర్‌ఫుల్‌ లేడీ పాత్ర తరహాలో విజయ శాంతి పాత్రను డిజైన్‌ చేశాడో ఏమో. ఏది ఏమైతేనేం, విజయ శాంతి ఆన్‌ సెట్స్‌.. కదా. ఇక బహుశా ఆ సీక్రెట్‌ రివీల్‌ కావడానికి ఇంకెంతో సమయం పట్టకపోవచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS