1989లో 'కొడుకు దిద్దిన కాపురం' సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయ శాంతితో కలిసి నటించాడు మహేష్‌బాబు. తల్లీ కొడుకుల పాత్రలు పోషించిన ఈ ఇద్దరూ ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ మళ్లీ ఇప్పుడు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఆనాటి జ్ఞాపకాల్ని మహేష్‌బాబు గుర్తు చేసుకున్నారు. కాలచక్రం గిర్రున తిరిగింది. ఈ జీవిత చక్రంలో ఎక్కడ స్టార్ట్ అయ్యామో అక్కడికే తిరిగి రావాలి.. అంటూ ఎమోషనల్‌గా మహేష్ తన అనుభవాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు.
ఈ ట్వీట్‌కి రిప్లై ఇస్తూ, మహేష్‌లో ఎలాంటి మార్పు లేదు. 30 ఏళ్ల తర్వాత కూడా మహేష్ వ్యక్తిత్వం అలాగే ఉంది. 1980లో నా సినీ కెరీర్ సూపర్ స్టార్ కృష్ణ గారితో మొదలైంది. మళ్లీ ఇప్పుడు నా సెకండ్ ఇన్నింగ్స్ మహేష్‌బాబుతో స్టార్ట్ అవుతోంది. ఇద్దరిదీ ఒకే వ్యక్తిత్వం. ఆ వారసత్వం నుండి లభించినదే అంతటి గొప్ప వ్యక్తిత్వం అని మహేష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు సీనియర్ నటి విజయ శాంతి.
It all started here ..⏳
— Mahesh Babu (@urstrulyMahesh) September 12, 2019
Year - 1989
Location - Sets of Koduku Diddina Kapuram
.
.
30 years later ⌛
.
.
I'm working with @vijayashanthi_m garu once again in #SarileruNeekevvaru... life has come a full circle...😇#throwbackthursday #nostalgia pic.twitter.com/cEjrPhadKr
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాతో విజయ శాంతి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తుండగా, విజయశాంతి కాలేజ్ లెక్చరర్‌గా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తోంది.