లేడీ సూపర్‌స్టార్‌కి క్యూ కడుతున్న కొత్త ప్రాజెక్టులు!

మరిన్ని వార్తలు

లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి సెకండ్‌ ఇన్నింగ్స్‌ ఘనంగా స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాతో ఆమె రీ ఎంట్రీ మొదలైంది. ఈ సినిమాలో విజయ శాంతి ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఎంతైనా సీనియర్‌ నటి, అందులోనూ లేడీ సూపర్‌ స్టార్‌ కాబట్టి, ఈ సినిమాలో ఆమె నటించడానికి కొన్ని రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ పెట్టిందట.

 

అందులో భాగంగా లైవ్‌ లొకేషన్స్‌ వాడాల్సిన కొన్ని సన్నివేశాల కోసం సెట్స్‌ని యూజ్‌ చేయాల్సి వస్తోందనీ ఫిలిం నగర్‌ టాక్‌. కర్నూల్‌ ల్యాండ్‌ మార్క్‌ కొండారెడ్డి బురుజు వద్ద కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయాల్సి ఉందట. అయితే, అందుకు విజయశాంతి అభ్యంతరం చెప్పడంతో ఆ లొకేషన్‌ని సెట్‌గా రూపొందించాల్సి వచ్చిందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారం. రూల్స్‌ సంగతి ఎలా ఉన్నా, ఆమె నటిస్తున్న సీన్ల అవుట్‌ పుట్‌ అద్భుతంగా వస్తోందట. అది చూసి డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నాడట. అదే ఉత్సాహంతో అనిల్‌ తన తదుపరి చిత్రం కోసం విజయశాంతి డేట్స్‌ని లాక్‌ చేశాడని తెలుస్తోంది.

 

మరోవైపు చిరంజీవి - కొరటాల శివ సినిమాలో విజయ శాంతి నటిస్తుందనే సమాచారం కూడా ఉంది. దీంతో పాటు, మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు విజయ శాంతి ఖాతాలో పడుతున్నట్లు తెలుస్తోంది. అంటే టాలీవుడ్‌కి అత్యంత కీలకమైన, హుందా అయిన పాత్ర అంటే విజయశాంతే గుర్తొచ్చేలా దర్శక, నిర్మాతలు క్యారెక్టర్లు డిజైన్‌ చేస్తున్నారట. సో లేడీ సూపర్‌ స్టార్‌ ఇకపై సూపర్‌ బిజీ అయిపోనుందని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS