ఈ మధ్యకాలంలో ప్రముఖ వ్యక్తుల పైన చిత్రాల రావడం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఒక ప్రముఖ సంఘం పైన ఒక చిత్రం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.
వినిపిస్తున్న వార్తల ప్రకారం, ప్రముఖ రాజకీయ పార్టీ అయిన బీజీపీ కి మాతృ సంస్థగా చెప్పుకునే RSS పైన ఒక చిత్రాన్ని రూపొందించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక ఇందులో ప్రముఖ బాలీవుడ్ హీరో ప్రధాన పాత్ర పోషించనున్నాడట, అయితే ఈ చిత్రానికి కథ మాత్రం ప్రముఖ రచయత విజయేంద్ర ప్రసాద అందించనున్నారు అన్న వార్త ఇప్పుడు హల్చల్ చేస్తున్నది.
ఈ చిత్రాన్ని RSS ప్రముఖులు దగ్గరగా ఉంది పర్యవేక్షిస్తారు అని తెలుస్తుండగా త్వరలోనే ఈ చిత్రం పట్టాలేక్కనుందట. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఒకవేళ గనుక ఈ వార్త నిజమైతే ఇదొక సంచలన చిత్రమయ్యే అవకాశం ఉంది.