భారీ విడుదలకి సిద్ధమైన బాహుబలి 2

By iQlikMovies - May 03, 2018 - 17:42 PM IST

మరిన్ని వార్తలు

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా (చైనా మినహా) బాహుబలి 2  విడుదలవ్వడం ప్రేక్షకులని ఆకట్టుకోవడంతో పాటుగా కమర్షియల్ గా కూడా ఘన విజయం సాధించింది.

ఇక ఇప్పుడు మరోసారి ఆ చిత్రం చైనాలో విడుదలయ్యేందుకు రంగం సిద్ధమయింది. తెలియవస్తున్న వివరాల ప్రకారం, చైనాలోని ఐమాక్స్ స్క్రీన్స్ పైన విడుదలవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పట్టికే దంగల్ చిత్రం చైనాలో 7000 స్క్రీన్స్ లో విడుదలైంది, ఇప్పుడు ఆ రికార్డుని బాహుబలి 2 చిత్రం 8000 స్క్రీన్స్ లో విడుదలవుతూ కొత్త రికార్డు సృష్టించింది.

అయితే బాహుబలి 1 చైనా లో గతంలో విడుదలై ఆశించినంతగా ఆడలేదు. దీనితో బాహుబలి 2 చిత్రాన్ని విడుదల చేసే సమయంలో నిర్మాతలు జాగ్రత్తపడుతున్నట్టుగా తెలిసింది.

బాహుబలి 2 చైనాలో ఘనవిజయం సాధించాలి అని కోరుకుందాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS