రజినీకాంత్ - కమల్ హసన్ లు ఈయన ముందు జూనియర్స్

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే లోకనాయకుడు కమల్ హసన్ లని తమిళ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం అగ్ర హీరోలుగా చూస్తారు. కారణం- వారి నటనా ప్రతిభ అలాగే వారి పట్ల అందరికీ ఉన్న మర్యాద.

ఈ సందర్భంగా వీరిద్దరూ నా ముందు జూనియర్స్ అంటూ ఒక నటుడు వ్యాఖ్యానించడం తీవ్ర దూమారం రేపుతున్నది. అసలేం జరిగిందంటే- ప్రముఖ నటుడు రాజకీయవేత్త అయిన కెప్టెన్ విజయ్ కాంత్ 2007నుండి తమిళనాట ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.

ఇప్పుడు తాజాగా రజినీకాంత్ & కమల్ హసన్ లు రాజకీయాల్లోకి అడుగుపెట్టడం పైన ఆయన స్పందిస్తూ- వారిద్దరూ తనకి రాజకీయాల్లో జూనియర్స్ అని అలాగే రజినీ, కమల్ హాసన్ రాజకీయాల్లో గెలవలేరు అని జోస్యం చెప్పాడు.

సినిమారంగంలో వారు సీనియర్లు అయినప్పటికీ ఇప్పుడు రాజకీయాల్లో మాత్రం తన వెనుకనే వారు వుంటారు అని కుండబద్దలు కొట్టేశాడు. మరి రజినీకాంత్-కమల్ హసన్ వీటి పైన ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS