తమిళంలో గోలీసోడా' సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. అది కన్నడలోకి రీమేక్ అయ్యి, అక్కడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సాధారణంగా ఇలాంటి సినిమాల్ని టచ్ చేయాలంటే చాలా ధైర్యం చేయాలి. బాలనటుడిగా తెలుగులో 'రేసుగుర్రం' తదితర సినిమాల్లో నటించిన విక్రమ్ సహిదేవ్ కన్నడ 'గోలీసోడా'లో నటించి మెప్పించాడు. ఆ సినిమా ఇప్పుడు తెలుగులోకి 'ఎవడు తక్కువ కాదు' టైటిల్‌తో డబ్ అవుతోంది. మామూలుగా ఇలాంటి సినిమాల్ని ప్రమోట్ చేయడానికి పెద్దగా ఎవరూ ఆశక్తి చూపరు.
అయితే, కాన్సెప్ట్ నచ్చితే, ఖర్చుకు వెనుకాడని నైజం నిర్మాత లగడపాటి శ్రీధర్‌ది. తన కుమారుడి సినిమా అని కాదు, ఈ సినిమా కాన్సెప్ట్ మీద పూర్తి నమ్మకంతో తెలుగులో బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రోమోస్ చూసిన వారికి సినిమాలో ఖచ్చితంగా మంచి విషయముందనే భావన కలుగుతుంది. ఈ నెల 24న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో టాలీవుడ్‌లో ఇప్పుడు అందరూ ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. కొన్ని సినిమాల గురించి, మాత్రమే ఇలాంటి చర్చ జరుగుతుంది. ప్రోమోస్, ప్రీ రిలీజ్ బజ్ చూశాక సినిమా చూడాలనే ఆశక్తి ప్రతీ ఒక్కరిలోనూ కలగడం సహజం. ఈ సినిమా హిట్ అయితే, విక్రమ్ సహిదేవ్ ప్రామిసింగ్ యంగ్‌స్టర్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు పొందుతాడు.