విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ, హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా క్రేజ్‌తో దూస్కెళ్తోన్న హీరో విక్రమ్. తమిళ హీరో అయినప్పటికీ, తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది విక్రమ్‌కి. సినిమా కోసం ఎంతటి రిస్క్‌కైనా వెనుకాడడు. రిస్క్‌తో సావాసం చేస్తూ ఉంటాడు విక్రమ్. సినిమా అంటే అంత ప్యాషన్ ఆయనకి. అందుకే తన వారసున్ని కూడా సినిమా రంగానికే పరిచయం చేయబోతున్నాడు. త్వరలోనే హీరోగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నాడు విక్రమ్ కొడుకు ధృవ. తెలుగులో సంచలన విజయం సాధించిన 'అర్జున్‌రెడ్డి' సినిమాని తమిళంలో రీమేక్ చేస్తున్నారు. బాలా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే విక్రమ్ తనయుడు ధృవ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. నాలుగు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించి, 40 కోట్లు వసూళ్లు సాధించి, రికార్డులు కొల్లగొట్టిన సినిమా 'అర్జున్‌రెడ్డి'. విజయ్ దేవరకొండ, షాలినీ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి ఈ సినిమాతో. ఈ సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఇలాంటి సినిమాని తొలి సినిమాగా ఎంచుకున్నాడంటే, ధృవ కూడా తండ్రిలాగే విలక్షణ దారిలోనే నడుస్తాడనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ముద్దుగుమ్మ శ్రియా శర్మని ఎంచుకున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారమ్. తెలుగులో 'జై చిరంజీవ' సినిమాతో బాల నటిగా పరిచయమైన శ్రియా శర్మ నాగార్జున నిర్మాణంలో తెరకెక్కిన 'నిర్మలా కాన్వెంట్' సినిమాతో హీరోయిన్‌గా మారింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు.