ప్రతినాయకుడ్ని ఎంచుకునే విషయంలో దర్శకులు ఆచి తూచి స్పందిస్తున్నారు. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాలకు. రొటీన్ విలనిజం అస్సలు పనిచేయడం లేదు. ఎందుకే విలన్లలోనూ స్టార్ డమ్ వెదుకుతున్నారు. అందుకే ఉపేంద్ర, ఆది పినిశెట్టి, జగపతిబాబు లాంటి వాళ్లు విలన్లుగా మారారు. సన్నాఫ్ సత్యమూర్తిలో విలన్ గా నటించి మెప్పించాడు ఉపేంద్ర. ఇప్పుడాయనకు మరో అవకాశం దక్కిందని టాక్.
మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి `సర్కారు వారి పాట` అనే పేరు పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ ఖాయమైందా, లేదా? అనే విషయం ఒకట్రెండు రోజుల్లో తెలుస్తుంది. ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా ఉపేంద్ర ప్లేసు దాదాపుగా ఖాయమైంది. కథానాయికగా కైరా అద్వాణీ, కీర్తి సురేష్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీళ్లలో ఒకరిని ఎంచుకోవాల్సివుంది. జులై - ఆగస్టు మధ్యలో ఈ చిత్రం పట్టాలెక్కుతుంది.