'అఖిల్' సినిమాతో బిగ్ డిజాస్టర్‌ని చవిచూసిన డైరెక్టర్ వినాయక్‌కి చిరంజీవి 150వ సినిమాతో చెప్పలేని రీఫ్రెష్మెంట్ దక్కింది. 'ఖైదీ నెం 150' సినిమా తర్వాత వినాయక్ తెరకెక్కించిన చిత్రం 'ఇంటెలిజెంట్'. వరుసగా మెగా ఆఫర్ ఇది వినాయక్‌కి. మెగా మేనల్లుడు సాయి ధరమ్‌తేజ్‌తో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చేస్తున్నంత సేపూ చిరంజీవితోనే మళ్లీ ఇంకో సినిమా తీస్తున్నానా అనే ఫీలింగ్ కలిగిందట చాలా సార్లు వినాయక్‌కి.
ఈ సినిమా విజయంపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు వినాయక్. రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది 'ఇంటెలిజెంట్'. ఈ కాన్ఫిడెన్స్‌తోనే తాను గతంలో అనుకున్న బిగ్ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించే ఆలోచన చేస్తాడంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ బిగ్ ప్రాజెక్ట్‌ల్లో ఒకటి మహేష్‌బాబుతో సినిమా. అయితే 'ఇంటెలిజెంట్' తర్వాత రెండు నెలలు గ్యాప్ తీసుకుంటానని వినాయక్ చెబుతున్నాడు. ఆ తర్వాత వినాయక్ టేకప్ చేసే సినిమా ఏంటి? అనే దానిపై ఆశక్తి నెలకొంది. మరో పక్క 'అదుర్స్'కి సీక్వెల్ చేయాలనే యోచనలో కూడా వినాయక్ ఉన్నాడు.
అయితే ఇప్పటికిప్పుడు 'అదుర్స్' చేయాలంటే ఎన్టీఆర్ ఖాళీగా లేడు. త్రివిక్రమ్‌తో సినిమా కోసం సంసిద్ధమవుతున్నాడు. కానీ మహేష్‌బాబు, కొరటాల శివతో చేస్తున్న 'భరత్ అనే నేను' తర్వాత ఏ సినిమాకి కమిట్ అవుతాడనేది క్లారిటీ లేదు. ఈ సినిమా నిర్మాణం దాదాపు చివరి దశకు చేరింది. ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. సో ఒకవేళ వినాయక్ - మహేష్‌బాబు కాంబినేషన్ ఈ గ్యాప్‌లో కానీ సెట్ అవుతుందేమో!
మహేష్ కోసం వినాయక్ గతంలోనే ఓ కథని ప్రిపేర్ చేశాడనీ సమాచారమ్. చూడాలి మరి. వినాయక్ జోరు, నమ్మకం చూస్తుంటే త్వరలోనే నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి రంగం సిద్ధం చేసేటట్లే ఉన్నాడు మరి.