మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, ఆప్తుడు... వి.వి.వినాయక్. చిరంజీవితో ఠాగూర్ తీసి హిట్టు కొట్టాడు. రామ్ చరణ్, అల్లుఅర్జున్ లకూ హిట్లు అందించాడు. చిరంజీవి రీ ఎంట్రీ సినిమా వినాయక్ కే దక్కింది. ఖైది నెం.150తో చిరు రీ ఎంట్రీ కి ఘనమైన స్వాగతం పలికాడు. ఇప్పుడు చిరంజీవితో మరోసారి కలిసి పనిచేయబోతున్నట్టు టాక్. మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం `లూసీఫర్` ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేద్దామనుకుంటున్నారు.
మోహన్‌లాల్ పోషించిన పాత్రలో చిరంజీవి, ఫృథ్వీరాజ్ నటించిన పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఈ సినిమా రైట్స్‌ని రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు. దర్శకత్వ బాధ్యతల్ని వినాయక్‌కి అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరవాతే లూసీఫర్ రీమేక్ పట్టాలెక్కుతుంది.