ట్రెండింగ్‌లో - అనుష్క పెళ్లి గురించే

మరిన్ని వార్తలు

ఇప్పుడు దేశమే కాదు, ప్రపంచమంతా చర్చించుకుంటోంది విరాట్‌ కోహ్లీ వివాహం గురించే. గత కొంత కాలంగా బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కాతో విరాట్‌ పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడ చూసినా ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని హాయిగా విహరిస్తున్న వీడియోలు,ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారంటూ వార్తలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. 

అయితే ఈ విషయంలో అఫీషియల్‌ క్లారిటీ అయితే లేదు. కానీ అయినా వీరిద్దరూ ఇంత సీక్రెట్‌గా వివాహం చేసుకోవాల్సిన అవసరమేముంది. ఈ వివాహానికి కోహ్లీ నుండి క్రికెట్‌లో కేవలం ఇద్దరికే ఆహ్వానం అందిందట. వారిద్దరు ఎవరంటే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, సిక్సర్స్‌ కింగ్‌ యువరాజ్‌ సింగ్‌ అట. ఇక అనుష్క వైపు నుండి కూడా చాలా కొద్ది మందికే ఆహ్వానం అందిందట. అది అమీర్‌ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌, ఆదిత్య చోప్రా, డైరెక్టర్‌ మనీష్‌ శర్మలకు మాత్రమే ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. ఓ పక్క ఇప్పటికే అనుష్క పేరెంట్స్‌ విదేశాలకు చేరుకున్నారు. అలాగే విరాట్‌ పేరెంట్స్‌ కూడా విదేశాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. 

వీరి పెళ్లి వేడుక డిశంబర్‌ 12న ఆస్ట్రేలియాలోని ఆడినైట్‌లో జరగనుందనీ సమాచారమ్‌. అయితే మరో పక్క ఇటలీలోని మిలాన్‌లో వీరి వివాహం జరగబోతోందంటూ మరో సమాచారమ్‌. అయితే అసలు వీరిది వివాహం కాదనీ, జస్ట్‌ ఎంగేజ్‌మెంట్‌ మాత్రమే అంటూ మరో ప్రచారం జరుగుతోంది. అసలింతకీ విరాట్‌ - అనుష్కలు ఇంత సీక్రెట్‌గా ఈ వేడును ప్లాన్‌ చేసుకోవడమేంటో తెలీని గందరగోళంలో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఆ రకంగా ఈ టాపిక్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. క్లారిటీ రావాలంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS