విమానంలో బాలీవుడ్ నటిపై వేధింపులు

మరిన్ని వార్తలు

దంగల్ & సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న జైరా వసింకి చేదుఅనుభవం ఎదురైంది.

వివరాల్లోకి వెళితే, ఆమె ఢిల్లీ నుండి ముంబైకి ఎయిర్ విస్తారా విమానంలో వస్తున్న క్రమంలో ఆమె వెనుక సీట్ లో కూర్చున్న వ్యక్తి ఆమె పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించాడు అని చెప్పింది. తన సీట్ పైకి అతను కాళ్ళు పెట్టిన ఫోటో ని కూడా ఆమె ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అందరికి పోస్ట్ చేసింది.

ఆ సమయంలో తాను ఎంతగా భయపడింది అనేది కూడా తను పోస్ట్ చేసిన వీడియో ద్వారా చెప్పింది. ఈ సంఘటన పట్ల ఎయిర్ విస్తారా వెంటనే స్పందించి విచారణకి ఆదేశాలిచ్చింది.

అయితే ఈ సంఘటన పట్ల ఒక్కసారిగా అందరు దిగ్బ్రాంతి చెందారు. జైరా వసిం మైనర్ కూడా అవ్వడంతో ఈ విషయాన్ని మరింత తీవ్రంగా పరిగణించాలి అని అందరు డిమాండ్ చేస్తున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS