కరోనా సెకండ్ వేవ్ ఉధృతి వల్ల... థియేటర్లు మూతబడ్డాయి. సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. చాలా సినిమాలు ఓటీటీ దారి వెతుక్కుంటూ వెళ్తున్నాయి. రానా నటించిన `విరాటపర్వం` కూడా ఓటీటీలోనే విడుదల కానుందని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాని దాదాపు 30 కోట్లకు ఓటీటీకి అమ్మేశారని, త్వరలోనే ఓటీటీలో ఈసినిమా స్ట్రీమింగ్ కానుందని గాసిప్పులు మొదలయ్యాయి. వీటిపై... దర్శకుడు వేణు ఉడుగుల స్పందించారు.
ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడం లేదని, అసలు తమకు ఆ ఉద్దేశ్యమేలేదని, ఈ సినిమాని వెండి తెరపైనే చూపిస్తామన్నారు. ప్రస్తుతం కరోనాతో థియేటర్లు మూదపడ్డాయని, పరిస్థితులు ఓ కొలిక్కి వచ్చాక కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని తెలిపారు.