శివ, అక్షతా శ్రీధర్ హీరోహీరోయిన్లుగా సైన్స్ స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న చిత్రం ‘విశాఖపట్టణ కేంద్రం’. జబర్దస్త్ ఫేం సతీష్ బత్తుల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మర్రిమేకల మల్లికార్జున్ నిర్మాత. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకాభిమానులందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సినిమా పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా... నిర్మాత మర్రిమేకల మల్లికార్జున్ మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులు, అభిమానులకు మా ‘విశాఖపట్టణ కేంద్రం’ యూనిట్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మధ్య కాలంలో అందరం చాలా టఫ్ సిట్యువేషన్స్‌ను ఫేస్ చేశాం.
ముఖ్యంగా సినీ పరిశ్రమ. ఇప్పుడు పరిస్థితులు చక్కబడుతున్నాయి. అందరికీ ఇకపై మంచి జరుగుతుంది. సినిమా విషయానికి వస్తే.. సతీష్ కథ చెప్పగానే బాగా నచ్చింది. ఆయన సినిమాను నెరేట్ చేసిన దాని కంటే చక్కగా తెరకెక్కించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. ఓ మంచి సినిమాను రూపొందించడంలో నిర్మాతగా నా వంతు బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించాను. హీరో శివ, హీరోయిన్ అక్షతా శ్రీధర్ చక్కగా నటించారు. మంచి టీం కుదిరింది. మా ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఉన్నాం. త్వరలోనే మీ ముందుకు వస్తాం’’అని అన్నారు.