మాస్ పల్స్ తెలుసుకోవాలంటే మాస్‌లా మారిపోవాలి. అప్పుడు గానీ, వాళ్లకు ఏం కావాలో, వాళ్లకు ఏం ఉంటే నచ్చుతుందో అర్థం కాదు. విశాల్ కూడా ఇదే చేస్తాడు. హాయిగా నేల టికెట్ కొనుక్కుని, సినిమా చూసి ప్రేక్షకుల పల్స్ అంచనా వేస్తాడు. ఎందుకంటే విశాల్ కూడా మాస్ హీరో కాబట్టి. తనలోనూ మాస్ ఉన్నాడు కాబట్టి. హైదరాబాద్‌లోని లక్ష్మీకళ థియేటర్లో విశాల్ మాస్ సినిమాల్ని చూస్తాడట. నేల టికెట్టు కొనుక్కుని మరీ. అప్పుడే తనకు మాస్ పల్స్ తెలుస్తుందంటున్నాడు.
విశాల్ కథానాయకుడిగా `యాక్షన్` అనే సినిమా రూపొందింది. తమన్నా కథానాయిక. సుందర్ సి దర్శకత్వం వహించాడు. ఈనెల 15న విడుదల అవుతుంది. ఆ సినిమాని కూడా నేల టికెట్ కొనుక్కునే చూస్తానంటున్నాడు విశాల్. ఈ మాస్ హీరో సీక్రెట్ ఇదన్నమాట.