కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఈ మధ్య కొంచెం జోరు తగ్గించాడు. మొదట్లో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే విశాల్ ఇప్పుడు చాలా స్లో అయ్యాడు. ఈ మధ్య చెప్పుకోదగ్గ హిట్ కూడా లేదు విశాల్ ఖాతాలో. 2023లో వచ్చిన 'మార్క్ ఆంటోనీ', 24లో వచ్చిన 'రత్నం' సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. విశాల్ కొత్త ప్రాజెక్ట్స్ గూర్చి ఎలాంటి అప్డేట్స్ లేవు. అయితే అప్పుడెప్పుడో ఆగిపోయిన మూవీ దాదాపు 13 ఏళ్ళతరువాత తమిళంలో ఇప్పుడు రిలీజ్ అవుతోంది. 'మధగజ రాజా' మూవీ ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్ గా నటించారు.
'మధగజ రాజా' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న విశాల్ పై పలు పుకార్లు ప్రచారం అవుతున్నాయి. కారణం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం వచ్చిన విశాల్ లుక్ చూసి అంతా ఆందోళనకి గురి అయ్యారు. చాలా సన్నగా అయిపోయి, నిలబడటానికి చివరికి మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మైకు పట్టుకోలేక చేతులు వణుకుతూనే ఉన్నాయి. దీనితో విశాల్ కి ఏదో ఆరోగ్య సమస్య వచ్చింది అని, అందుకే ఇలా పాడైపోయారని, సినిమాలు కూడా కొత్తవి సైన్ చేయలేదని కోలీవుడ్ మీడియా ప్రచారం చేస్తోంది.
దీనితో విశాల్ టీమ్ అండ్ సన్నిహితులు ఈ వార్తలపై స్పందిస్తూ 'ఈ ప్రచారం ఫేక్ అని, ప్రస్తుతం విశాల్ సినిమాలు తగ్గించటానికి కారణం ఇతర బాధ్యతల్లో బిజీగా ఉండటమే అని, ఇక లుక్ మారటానికి కారణం తన నెక్స్ట్ సినిమాకోసం వెయిట్ తగ్గారని, అనారోగ్య సమస్యలు అంటూ ఏమీ లేవని క్లారిటీ ఇచ్చారు. మధగజ రాజా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనేటప్పుడు విశాల్ తీవ్రమైన చలి జ్వరంతో బాధ పడుతున్నారని, అందుకే అలా వణికిపోయారని బదులిచ్చారు. విపరీతమైన వీక్ నెస్ కారణంగా నిల్చోవటానికి ఇబ్బంది పడ్డారని, రెండు మూడు రోజులుగా ఇలాగే చలి జ్వరంతో బాధ పడుతున్నారని, కానీ ప్రమోషన్ కోసం తప్పక వచ్చారని తెలిపారు.
Take care vishal naa y hand ivolo nadungudhu?🥲 #MadhaGajaRaja pic.twitter.com/LLHjhDFKHp
— Sanjayrant/alterego (@as_rantts) January 5, 2025