తమిళ హీరో విశాల్ నటించిన 'అభిమన్యుడు' చిత్రం తెలుగులో విడుదలవుతున్న సందర్భంగా హైద్రాబాద్‌లో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించిన విషయాలను విశాల్ అభిమానులతో పంచుకున్నారు.
విశాల్ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. తాజా సినిమా 'ఇరుంబుతిరై' టైటిల్‌తో తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ప్రస్తుతం డిజిటల్ రంగంలో జరుగుతున్న అకృత్యాలు, అఘాయిత్యాలపై ఈ సినిమా స్టోరీ ఉంటుంది. పీ.ఎస్. మిత్రన్ మంచి విజన్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్స్ జనాన్ని ఎలా భయభ్రాంతుల్ని చేస్తున్నాయి? వాటి విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలనే అంశంతో ఈ సినిమా తెరకెక్కించారు. సినిమాలు సమాజంపై ప్రభావితం చూపిస్తాయి అన్న మాట వాస్తవమే. అందుకే సామాజిక బాధ్యతతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ అని విశాల్ అన్నారు. విశాల్ సరసన సమంత హీరోయిన్‌గా నటించిందీ సినిమాలో. సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉండగా ఈ సందర్భంగా విశాల్ రాజకీయంగా కూడా స్పందించారు. ఇటీవల జరిగిన 'తూత్తుకుడి' ఘటనపై ప్రధాని మోడీని సూటిగా ప్రశ్నించాడు విశాల్. తూత్తుకుడి ఆందోళనకారులపై షూట్ చేయమని ఎవరు ఆదేశాలిచ్చారు. దీనికి మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే ..' అని విశాల్ మోడీని డైరెక్ట్‌గా ప్రశ్నించారు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే, విశాల్ ఇటు సామాజిక అంశాలపైనా, అటు రాజకీయాలపైనా కూడా దృష్టి సారిస్తుంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే.