విశాల్ Vs టీ రాజేందర్

మరిన్ని వార్తలు

హీరో విశాల్ అంటేనే ఒక సంచలనంగా ఈమధ్యనే మారిపోయింది.

నడిగర్ సంఘం ఎన్నికల్లో అప్పటి అధ్యక్షుడు అయిన శరత్ కుమార్ ని ఓడించటం దగ్గర నుండి ఆయన పేరు వినపడుతూనే ఉంది. తాజాగా ఆర్కే నగర్ ఉపఎన్నికల నేపధ్యంలో ఆయన నామినేషన్ తిరస్కరణకి గురవ్వటం చర్చనీయాంశంగా మారింది.

ఇక నిన్న తమిళ నిర్మాతల మండలి సర్వసభ్య సమావేశంలో విశాల్ వ్యతిరేక వర్గం ఆయన పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. సుమారు రూ 7కోట్ల మేర డబ్బు దుర్వినియోగం జరిగింది అని ఇప్పుడు ఆ డబ్బుకి లెక్కలు చూపెట్టాలి అని చేరన్, టీ రాజేందర్ లు డిమాండ్ చేశారు.

 

దీని పై విశాల్ మాట్లాడుతూ- అటువంటి కుంభకోణం జరిగి ఉంటే తాము ఈ మీటింగ్ ఎలా జరుపుతాం అలాగే అవన్నీ నిరాధారమైన ఆరోపణలు, వాటికి స్పందించాల్సిన అవసరం లేదు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS