ఇటీవల వివాదాస్పదంగా వార్తల్లోకెక్కిన 'ఫలక్‌నుమా దాస్' డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌కి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయంతో వార్తల్లోకెక్కింది. నెట్ ఫ్లిక్స్ సంస్థ రెండు కోట్ల పది లక్షలకు ఆఫర్‌తో ఫలక్‌నుమా దాస్' నిర్మాతను సంప్రదించిందట. అయితే, నెట్ ఫ్లిక్స్‌ని కాదని, అమెజాన్ వైపు మొగ్గు చూపాడు 'ఫలక్‌నుమా దాస్'. నెట్ ఫ్లిక్స్ ఆఫర్‌ని 'ఫలక్‌నుమా దాస్' ఎందుకు వద్దనుకున్నాడు.? అంటూ సినీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది.
విషయమేంటంటే, నెట్ ఫ్లిక్స్ ఇలాంటి ఒప్పందాల విషయంలో ఇన్‌స్టాల్‌మెంట్స్ ప్రాతిపదికన పేమెంట్స్ చేస్తుంది. అయితే, అమెజాన్ సింగిల్ పేమెంట్ 2.15 కోట్లుతో ముందుకొచ్చిందట. దాంతో, ఫలక్‌నుమా దాస్ చివరి నిమిషంలో అటు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో 'ఫలక్‌నుమా దాస్' చేసినంత సౌండ్ ఇంకే సినిమా చేయలేదనడం అతిశయోక్తి కాదేమో. సినిమాలోని కంటెంట్ చాలా మందికి నచ్చింది.
కంటెంట్ సంగతి పక్కన పెడితే, హీరో విశ్వక్సేన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టడం వివాదాస్పదమైంది. అందులో కొంచెం హద్దులు మీరి ధూషణలకు దిగాడు విశ్వక్సేన్. ఆ వివాదం సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. దాంతో వసూళ్ల పంట పండింది.