నాని నిర్మాణంలో 'హిట్‌' సినిమా!

By Inkmantra - October 24, 2019 - 11:00 AM IST

మరిన్ని వార్తలు

నేచురల్‌ స్టార్‌ అంటూ హీరోగా తనదైన గుర్తింపు దక్కించున్నాడు నాని. నానిని హీరో అనేదాని కన్నా, పక్కింటబ్బాయ్‌గానే ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించారు. ఆ ఇమేజ్‌కి ఏమాత్రం డ్యామేజ్‌ కాకుండా కెరీర్‌ని బిల్డప్‌ చేసుకుంటున్నాడు నాని. ఈ ఏడాది నాని ఖాతాలో 'జెర్సీ', 'గ్యాంగ్‌లీడర్‌'తో రెండు హిట్లు పడ్డాయి. మరో రెండు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిలో 'వి' చిత్రంలో నాని నెగిటివ్‌ రోల్‌ పోషిస్తున్నాడు.

 

ఇదిలా ఉంటే, 'అ.!' అనే ఓ విభిన్నమైన చిత్రంతో నాని నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సినిమా రిజల్ట్‌ ఎలా ఉన్నా, కాన్సెప్ట్‌ నచ్చి ఆ సినిమాని తానే నిర్మించేందుకు ముందుకొచ్చిన నాని ప్రయత్నాన్ని అంతా మెచ్చుకున్నారు. తన బ్యానర్‌పై విభిన్న కథా చిత్రాలనే నిర్మిస్తానని చెప్పిన నాని దృష్టికి ఇంకో విలక్షణ చిత్రం వచ్చి చేరింది. ఆ చిత్రానికి టైటిల్‌ కూడా డిఫరెంట్‌గానే ఉంది. ఇంతకీ ఆ టైటిల్‌ ఏంటంటారా? 'హిట్‌'. భలే ఉంది కదా.

రిజల్ట్‌ ఎలా ఉన్నా, సినిమాని 'హిట్‌'గానే అభివర్ణించాల్సి వస్తుంది. ఎన్ని తెలివితేటలో నానికి. ఎక్కడి నుండి వచ్చేశాయో ఇన్ని తెలివితేటలు కదా. ఈ సినిమాలో హీరో ఎవరో తెలుసా.? 'ఫలక్‌నుమా దాస్‌'.. అదేనండీ ఆ సినిమాతో సెన్సేషన్‌ అయిన హీరో విశ్వక్సేన్‌. హీరోయిన్‌ ఎవరో తెలుసా.? 'చిలసౌ' బ్యూటీ రుహానీ శర్మ. వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌లో ప్రశాంతి త్రిపురనేని నిర్మాతగా సైలేష్‌ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందని తాజాగా అనౌన్స్‌మెంట్‌ వెలువడింది. అదీ సంగతి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS