ఫ‌ల‌క్‌నుమా దాస్‌... హ‌ద్దుమీరుతున్నాడా?

By iQlikMovies - June 03, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

తెలుగు చిత్ర‌సీమ‌లో వివాదాలు మామూలే. హీరోల అభిమానుల మ‌ధ్య గొడ‌వ‌లూ మామూలే. ఇప్పుడు అలాంటి గొడ‌వే ఒక‌టి చిత్ర‌సీమ‌లో దుమారం పెంచుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ - విశ్వ‌క్ సేన్ అభిమానులు నువ్వంటే నువ్వంటూ సోష‌ల్ మీడియా సాక్షిగా చెల‌రేగిపోతున్నారు. వాటికి విశ్వ‌క్ సేన్ చేష్ట‌లు కూడా అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. విశ్వ‌క్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఫ‌ల‌క్‌నామా దాస్‌` ఇటీవ‌లే విడుద‌లైంది. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా నిర్వ‌హించిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో విశ్వ‌క్‌సేన్ రెచ్చిపోయి మాట్లాడాడు.

 

`ఆల్రెడీ తెలంగాణ నుంచి ఒక‌డ్ని తీసుకొచ్చి నెత్తిమీద పెట్టుకున్నారు. నేను అలాంటివాడ్ని కాదు` అంటూ ప‌రోక్షంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఈ కామెంట్ల‌కు రౌడీ ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యారు. `ఫ‌ల‌క్‌నుమాదాస్` విడుద‌ల‌య్యాక‌.. ఆ సినిమానీ, విశ్వ‌క్‌సేన్‌నీ బాగా ట్రోల్ చేయ‌డం మొద‌లెట్టారు. ఇది చూసి విశ్వ‌క్ మ‌రింత రెచ్చిపోయాడు. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన ప్రెస్ మీట్లో విజ‌య్ ఫ్యాన్స్‌పై కౌంట‌ర్లు వేశాడు, వార్నింగులు ఇచ్చాడు.

 

అస‌లు ఫ్యాన్స్ గొడ‌వ‌పై ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ ఎందుకు మాట్లాడాడో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు. పైగా... ఫేస్ బుక్ లైవ్‌లో బూతులు కూడా మాట్లాడ‌డం మొద‌లెట్టాడు. ఇన్‌స్ట్రాగ్రామ్ లో బాక్సాఫీసుని ఉద్దేశించి ఓ బూతు మాట వాడేశాడు. ఇవ‌న్నీ... విశ్వ‌క్‌సేన్‌ని కార్న‌ర్ చేయ‌డానికి వాడుకుంటున్నారు రౌడీ ఫ్యాన్స్‌. విశ్వ‌క్‌సేన్ మ‌రీ హ‌ద్దుమీరి ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని, ఇదంతా త‌న ఆటిట్యూడ్ చూపించుకోవ‌డానికా? లేదంటే.. ఈ సినిమా ప‌బ్లిసిటీ కోసమా? అనేది తేల‌డం లేద‌ని ఇండ్ర‌స్ట్రీ పెద్ద‌లు కూడా మాట్లాడుకోవ‌డం వినిపిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS