వితికను బయటికి పంపించే క్రమంలో నామినేషన్ అప్పుడు జ్యోతక్క అలియాస్ శివజ్యోతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మొత్తానికి తాజా ఎలిమినేషన్లో వితికను హౌస్ నుండి బయటికి పంపించేసి, జ్యోతక్క కోరిక తీర్చేశారు బిగ్‌బాస్ టీమ్. నిజానికి ఎంట్రీ అనేది బిగ్‌బాస్ చేతుల్లోనే ఉంది కానీ, ఎలిమినేషన్ అనేది ఆడియన్స్ చేతుల్లో ఉండేది ఇంతవరకూ. కానీ, ఈ సీజన్లో అది కూడా బిగ్‌బాస్ చేతుల్లోనే ఉందనే టాక్ బాగా ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఎలిమినేషన్‌ని జెన్యూన్‌గా తీసుకోలేకపోతున్నారు ఆడియన్స్.
ఏది ఏమైతేనేం, ఆ క్యూట్ పెయిర్ విడిపోయింది. జంటగా ఇంట్లోకి పంపించి, ఇప్పుడు ఆ జంట నుండి ఒకరిని బయటికి పంపించేసి, జంటను ఒంటరి చేసేశారు. బయటికి వెళ్లిపోతూ, భర్తని వీడలేక వితిక, భార్యను వీడలేక వరుణ్ కన్నీటి పర్యంతమయ్యారు. వితిక తనకు ఎవ్రీథింగ్ అని హౌస్‌లో ఉన్నప్పుడే వరుణ్ అభివర్ణించాడు. వరుణ్ తనకు ఇన్సిప్రేషన్ అని వితిక చెప్పింది. మరి, వితికను వదిలి మరో 15 రోజులు హౌస్‌లో ఉండాలి వరుణ్. హౌస్‌ని వీడిపోతూ, తనవంతుగా వరుణ్‌కి వితిక ధైర్యం చెప్పింది.
రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ టైంలో కన్నీరు కార్చిన వరుణ్, మళ్లీ ఇప్పుడే కన్నీరు కార్చాడు. భార్య భర్తలే అయినా కానీ, నార్మల్ కంటెస్టెంట్స్‌గానే ఈ 90 రోజులూ వీరిద్దరూ హౌస్‌లో కొనసాగడం విశేషం. అప్పుడప్పుడూ చిన్న చిన్న గిల్లికజ్జాలు, మూతి విరుపులు, బుంగ మూతులు. బుజ్జగింపులతో ఈ జంట గత 90 రోజులుగా బిగ్‌బాస్ ప్రేక్షకుల్ని అలరించింది.