అయ్యో పాపం.. వితిక బిగ్‌ టార్గెట్‌ అయ్యిందే!

మరిన్ని వార్తలు

వరుణ్‌ - వితిక వైఫ్‌ అండ్‌ హజ్‌బెండ్స్‌ కావడంతో, తన ఇమ్యూనిటీ టాస్క్‌ కోసం వరుణ్‌ వితికను టార్గెట్‌ చేసుకున్నాడు. చల్లని కాపీ మీద పోయడం, ఆమెకి ఎంతో ఇష్టమైన టీషర్ట్‌ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించడం.. టాస్క్‌లో భాగంగా, వరుణ్‌ కొంచెం కష్టమే అయినా, ఈజీగా ప్రాసెస్‌ కంప్లీట్‌ చేసేశాడు. ఆ తర్వాత వితిక అలగడం మామూలే. ఎలాగోలా ఆమెని బుజ్జగించి, హగ్‌ చేసుకోవడంతో ఆమె కోపాన్ని తగ్గించేశాడు.

 

ఇక రవికృష్న షేవింగ్‌ ఫోమ్‌ని ఒక హౌస్‌మేట్‌ తలపై పూర్తిగా పోసేయాలి. మరో హౌస్‌మేట్‌ బెడ్‌ని వాటర్‌తో తడిపేయాలి. ఈ టాస్క్‌ని రవి కూడా కొంచెం ఈజీగానే కంప్లీట్‌ చేసేశాడు. శివజ్యోతి బెడ్‌ని వాటర్‌తో తడిపేయగా, ఫిజికల్‌ అటాక్‌కి సంబంధించి, షేవింగ్‌ ఫోమ్‌ని పూసే ప్రోసెస్‌కి వితికనే ఎంచుకున్నాడు. వితిక కో ఆపరేట్‌ చేయడంతో రవికి ఈ పని సులవైపోయింది. ఇక రాహుల్‌ టాస్క్‌లో కూడా వితిక ఎంతో ఇష్టపడే పిల్లోనే కట్‌ చేసి, స్విమ్మింగ్‌ పూల్‌లో పడేయాల్సి వచ్చింది. ఇలా ఇమ్యూనిటీ టాస్క్‌లు మూడింట్లోనూ వితిక మెయిన్‌ టార్గెట్‌ అయ్యింది.

 

ఇక ఈ వారం ఎలిమినేషన్‌ విషయానికి వస్తే, మెయిన్‌ టాస్క్‌ నుండి ఆరుగురు ఎలిమినేషన్‌ లిస్టులోకి వచ్చారు. వరుణ్‌, పునర్నవి, మహేష్‌, రాహుల్‌, రవికృష్ణ, హిమజ. వీరిలోంచి, ముగ్గురికి బిగ్‌బాస్‌ ఇమ్యూనిటీ పొందే అవకాశం ఇవ్వగా, ఆ ముగ్గురు ఎవరో ఆ ఆరుగురు ఓ అండర్‌ స్టాండింగ్‌తో ఎంచుకోమన్నారు. అలా హిమజ, మహేష్‌, పునర్నవి సేక్రిఫైస్‌ చేయగా, ఇమ్యూనిటీ టాస్క్‌లో రాహుల్‌, వరుణ్‌, రవి పోటీ పడ్డారు. టాస్క్‌ల్లో విన్‌ అయ్యి, ఇమ్యూనిటీ పొందారు. చివరిగా ఈ వారం మహేష్‌, పునర్నవి, హిమజ ఎలిమినేషన్‌ లిస్టులో ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS