ఒక వారం క్రితం ఆత్మహత్యకు పాల్పడిందంటూ నటి అలాగే హీరో వరుణ్ సందేశ్ భార్య అయిన వితికా షేరు వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే ఆ తరువాత అది ఆత్మహత్య కాదని తెలిసిపోయింది.
ఇక ఈ వార్తల నుండి పూర్తిగా బయటకి రాకముందే, మరోసారి హెడ్ లైన్స్ లోకి వితికా షేరు వచ్చేసింది. అయితే ఈ సారి మాత్రం ఒక మంచి పనికోసం ఆమె పేరు వార్తల్లోకి ఎక్కింది. వివరాల్లోకి వెళితే, క్యాన్సర్ ట్రీట్మెంట్ ద్వారా తమ జుట్టు కోల్పోయే స్త్రీల కోసం తన జుట్టులోని కొంతభాగాన్ని ఆమె ఇచ్చారు.
ఈ జుట్టుని, కీమో ద్వారా తమ జుట్టుని కోల్పోయినవారికి విగ్ రూపంలో అందచేస్తారు. తను జుట్టునికట్ చేయిస్తున్న క్రమాన్ని వీడియో తీయించి తన సోషల్ మీడియా ఎకౌంటు లో పెట్టింది.
ఈ పని చేయడంతో ఆమె ఒకే వారంలో అటు కాంట్రవర్సీ పరంగా ఇటు మంచి పని కారణంగా వార్తల్లోకి రావడం గమనార్హం.