ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త చిత్రం ఉన్నది ఒకటే జిందగీ మొన్ననే ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.
అయితే విడుదలైన మొదటి షో నుండే యావరేజ్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్రానికి మొదటి రోజు కలెక్షన్స్ కూడా యావరేజ్ గానే వచ్చాయి. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు కిషోర్ తిరుమల తెరపైన తెరకేక్కిచిన విధానంలో సాగతీత ధోరణి కనపడింది. అలాగే కిషోర్ తిరుమల ఈ చిత్రంలో ఫ్రెండ్షిప్ ని బేస్ చేసుకొని ట్రయాంగిల్ లవ్ స్టొరీ ని చూపెట్టే ప్రయత్నం చేశాడు. ఇక అందుకోసంతీసుకున్న నటీనటులు కూడా తమ వంతు పాత్రలు సమర్ధవంతంగానే పోషించారు అనే చెప్పాలి. అయితే ఈ దర్శకుడి నుండి నేను శైలజ వంటి సినిమాని చూసిన ప్రేక్షకులకి ఈ ఉన్నది ఒక్కటే జిందగీ అంతగా ఎక్కలేదు అనే చెప్పాలి.
ఇదిలావుండగా ఈ సినిమా మొత్తంలో అనుపమ పరమేశ్వరన్ పోషించిన మహా పాత్రకి చాలా మంచి పేరు దక్కింది అని చెప్పొచ్చు. దర్శకుడు తను చూపెట్టాలనుకున్న ఐడియా తెరపైన సాగదీసినట్టుగా కనపడుతుంది అలాగే సెకండ్ హాఫ్ లో కథనం మరి స్లో అయిపోవడంతో ప్రేక్షకులు ఒకింత అసహనానికి గురవుతున్నారు.
అయితే ఉన్నది ఒకటే జిందగీ చిత్రం చూసిన ప్రతిఒక్కరికి నచ్చిన రెండు అంశాలు ఏంటంటే- దేవిశ్రీప్రసాద్ సంగీతం & సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం.
మొత్తానికి ఉన్నది ఒకటే జిందగీ చిత్రం యావరేజ్ గా నిలిచిపోనుంది.