ముహూర్తం ఫిక్స్‌: మెగా డైరెక్టర్‌ హీరోగా మెగా ఎంట్రీ!

మరిన్ని వార్తలు

మెగాస్టార్‌తో 'ఠాగూర్‌', 'ఖైదీ నెంబర్‌ 150' వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్లు కొట్టి, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కి 'నాయక్‌', యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి 'ఆది', 'అదుర్స్‌' వంటి ఇండస్ట్రీ హిట్స్‌ ఇచ్చిన హిట్‌ డైరెక్టర్‌ వినాయక్‌ రూపు రేఖలు పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడాయన హీరోల్ని డైరెక్ట్‌ చేసే కెప్టెన్‌ కాదు. ఆయనే హీరో. వినాయక్‌ హీరోగా దిల్‌ రాజు నిర్మాణంలో ఓ సినిమా తెరకెక్కుతోందన్న సంగతి ఎప్పుడో తెలిసిందే. ఆ సినిమా కోసం వినాయక్‌ కసరత్తులు చేసి తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు.

 

జిమ్‌లో కసరత్తులు చేసి చేసి, స్టైలిష్‌గా హీరో లుక్స్‌లోకి వచ్చేశాడు. ఇక ఆలస్యమేముంది. సినిమా పట్టాలెక్కడమే తరువాయి. అందుకూ ముహూర్తం ఫిక్స్‌ చేసేశారు. విజయ దశమి ఘడియల్లో ఆయన పుట్టినరోజు నాడు అనగా అక్టోబర్‌ 9న కొబ్బరికాయ కొట్టేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేశారు. ఇక ఈ సినిమా కథా, కమామిషు ఏంటంటే, పీరియాడిక్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కనుందట. 1980ల కాలం నాటి స్టోరీ అట. ఆయన వయసుకు, బాడీ లాంగ్వేజ్‌కి తగిన కథ కావడంతో, కథలో డెప్త్‌ చాలా బాగుండడంతో, దిల్‌రాజు ఏరి కోరి వినాయక్‌ని ఒప్పించి, ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాడు.

 

ఇక ఈ ప్రత్యేకమైన చిత్రానికి దర్శకుడు కూడా ప్రత్యేకతలున్నవారే కావాలి కదా. అందుకే ఏమాత్రం తగ్గలేదు. క్రియేటివ్‌ టాలెంట్‌తో సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా పేరున్న శంకర్‌ శిష్యుడు ఎన్‌.నరసింహారావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇక హీరోయిన్‌ ఎవరన్నదే తెలియాల్సి ఉంది. త్వరలోనే ఆ విషయంలోనూ క్లారిటీ వచ్చేస్తుందిలెండి.. అదీ మన కొత్త హీరో వినాయక్‌ సినిమా కథ ముచ్చట్లు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS