Adhurs 2, Vinayak: అదుర్స్ 2.. పై నీళ్లు చ‌ల్లిన వినాయ‌క్‌

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ కెరీర్‌లో ఓ మైలు రాయి.... అదుర్స్. అందులో చారిగా ఎన్టీఆర్ న‌ట‌న అదుర్స్‌. భ‌ట్టుగా బ్ర‌హ్మానందం క్యారెక్ట‌ర్ గురించైతే ఇక చెప్పాల్సిన ప‌నిలేదు. వీరిద్ద‌రి కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో ప‌డింది. ఇప్ప‌టికీ మీమ్స్‌లో చారి, భ‌ట్టు... క‌నిపిస్తూనే ఉంటారు. ఇలాంటి ఈ సినిమాకి సీక్వెల్ వ‌స్తుంద‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. సీక్వెల్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది కాబ‌ట్టి... అదుర్స్ 2 రావ‌డం ఖాయ‌మ‌నుకొన్నారంతా. కానీ.. ఆ ఆశ‌ల‌పై వినాయ‌క్ నీళ్లు చ‌ల్లాడు. ఈ సినిమాకి సీక్వెల్ రాద‌ని తేల్చి చెప్పేశాడు.

 

``ఎన్టీఆర్ కెరీర్‌లోనూ, నా కెరీర్‌లోనూ అదుర్స్ మ‌ర్చిపోలేని చిత్రం. దానికి సీక్వెల్ చేద్దామ‌ని చాలా సార్లు అనుకొన్నాం. కొన్ని క‌థ‌లు కూడా విన్నాం. కానీ.. ఏదీ సెట్ కాలేదు. అందుకే ఆ ప్ర‌య‌త్నం విర‌మించుకొన్నాం. కొన్ని సినిమాల్ని ముట్టుకోకుండా అలా ఉంచేయ‌డ‌మే ఉత్త‌మం. అందుకే అదుర్స్ 2 సీక్వెల్ ఆలోచ‌న ప‌క్క‌న పెట్టామ‌``ని చెప్పుకొచ్చాడు వినాయ‌క్‌. సో... అదుర్స్ 2... లేన‌ట్టే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS