సెన్సేషనల్ డైరెక్టర్ వి వి వినాయక్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `సీనయ్య`. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నరసింహ దర్శకత్వంలో దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగాయి. ఈ చిత్రం ముహూర్తపు షాట్‌కి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు క్లాప్ నివ్వగా సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సి. కళ్యాణ్, దానయ్య డి.వి.వి,అనీల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా... హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ - " వినయ్‌తో `ఆది` సినిమా నుండి నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ తరువాత మా సంస్థను స్థాపించిన తర్వాత తొలి సినిమాగా ఆయన దర్శకత్వంలోనే `దిల్` సినిమా చేశాం. ఆ సినిమా పేరే నా ఇంటి పేరుగా మార్చేంత పెద్ద సినిమా అయ్యింది. మా సంస్థ సక్సెస్‌ఫుల్‌గా, వినాయక్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా జర్నీ ట్రావెల్ అవుతున్న సందర్భంలో డైరెక్టర్ శంకర్ దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేసిన నరసింహ వేరే కథ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ సీనయ్య కథ అనుకున్నాడు.